మెడిసిన్ బాటిళ్లు అన్నారు, తీరా చూస్తే మందు బాటిళ్లు.. డ్రై స్టేట్‌కు కొరియర్, కానీ..!

By Mahesh K  |  First Published Oct 31, 2023, 7:30 PM IST

బిహార్ 2016 నుంచి డ్రై స్టేట్ అని తెలిసిందే. అక్కడికి మెడిసిన్ అని చెప్పి కొరియర్ సంస్థలను బురిడీ కొట్టించి మందును పంపిస్తున్నట్టు తేలింది. హర్యానాలో ఆదివారం ఈ విషయం బయటపడింది.
 


న్యూఢిల్లీ: మద్యంపై ఎంతటి నిషేధం విధిస్తే అది అంతగా బ్లాక్‌గా మారిపోతుంది. వైట్ మార్కెట్‌లో అందుబాటులో లేకుండా చేసినంత మాత్రానా దాని పీడ విరగడైపోయిందనుకోవడానికి లేదు. ఎందుకంటే అది అంతకు మించిన ధరలతో అది బ్లాక్ మార్కెట్‌లో రెక్కలు విప్పుకుంటుందనే వాదనలు తరచుగా వినిపిస్తుంటాయి. వీటిని నిజం చేస్తూ హర్యానాలో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని ఓ కంపెనీ నుంచి మెడిసిన్ బాటిళ్లను బిహార్‌కు పంపేందుకు ఓ కొరియర్‌కు ఆర్డర్ పెట్టారు. వారు స్టాక్ తీసుకుని వేర్ హౌజ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి బిహార్‌కు పంపడానికి ముందు ఒక సారి స్టాక్‌ను స్కాన్ చేశారు. ఇక్కడే అసలు విషయం బయటపడింది. ఆ కార్టన్ బాక్స్‌లలో ఉన్నవి మెడిసిన్స్ కాదని, అవి విస్కీ నింపిన ప్యాకెట్లనీ తేలింది.

ఐఎంటీ మనేసర్ నుంచి ఓ కొరియర్ కంపెనీకి ఆర్డర్ వచ్చింది. బిహార్‌కు మెడిసిన్స్ తరలించాలని ఆర్డర్ ఇచ్చారు. ఆ కొరియర్ సిబ్బంది ఐఎంటీ మనేసర్ వద్దకు వెళ్లి కనీసం ఆరు పెద్ద బాక్సులను తీసుకుని బిలాస్‌పూర్ పత్రేరిలోని వేర్ హౌజ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి బయటికి పంపడానికి ముందు ఆ స్టాక్ స్కాన్ చేశారు. మొత్తంగా లిక్విడ్ తరహాలోనే ఉన్న దానిపై వారు అనుమానం వ్యక్తం చేశారు. చివరకు పై అధికారులకు చెప్పగా.. వారు పోలీసులను అలర్ట్ చేశారు.

Latest Videos

Also Read: యాపిల్ ఫోన్ సేఫా? కాదా?: హ్యాకింగ్ వాదనలపై కేంద్రమంత్రి స్పందన

పోలీసులు వచ్చి పరిశీలించారు. అది ఇండియన్ మేడ్ ఫారీన్ లిక్కర్ అని తేలింది. పెద్ద కార్టన్‌లలో సుమారు 1,100 ప్లాస్టిక్ పౌచ్‌లలో ఈ విస్కీని నింపి మెడిసిన్ల పేరిట కొరియర్‌లో డ్రై స్టేట్ బిహార్‌కు ఆర్డర్ పెట్టారు. 

బిహార్‌లో 2016 ఏప్రిల్ 5వ తేదీ నుంచి మద్యపానంపై నిషేధం అమల్లో ఉన్నది. 

ఆ విస్కీని బిలాస్ పూర్ పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కొరియర్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ ఇంద్రజీత్ యాదవ్ ఫిర్యాదుపై కేసు ఫైల్ అయింది. తాము ఆ మందు పంపినవారి, స్వీకరించబోతున్న వారి వివరాలు, చిరునామాను పోలీసులకు అందించినట్టు యాదవ్ వివరించారు.

click me!