రిక్షా డ్రైవర్ కి ఐటీ నోటీసులు.. రూ.3కోట్లు చెల్లించాలంటూ..!

By telugu news teamFirst Published Oct 25, 2021, 10:14 AM IST
Highlights

ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయలేమని స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అనూజ్ కుమార్ సింగ్ చెప్పడం గమనార్హం. అయితే.. అతని విషయాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకుంటామని చెప్పడం గమనార్హం.

ఆటో డ్రైవర్ కీ ఎంత ఆదాయం ఉంటుంది..? కనీసం ఒక రోజులో మూడు పూటల ఆహారం తినేంత ఆదాయం కూడా వారికి రాదు. అలాంటి వ్యక్తికి ఆదాయ పన్నుశాఖ అధికారులు నోటీసులు అందించారు. రూ..3కోట్లు చెల్లించాలంటూ  ఆ నోటీసులు పంపడం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర లోని బకల్ పూర్ ప్రాంతంలోని అమర్ కాలనీకి చెందిన ప్రతాప్ సింగ్ కి ఆదాయ పన్ను శాఖ అధికారుల నుంచి  నోటీసులు అందాయి. దీంతో.. అతను వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.

Also Read: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. రక్తమోడుతున్న పాపతో 5 ఆస్పత్రుల చుట్టూ తిరిగిన తండ్రి... పరిస్థితి విషమం...

అయితే.. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయలేమని స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అనూజ్ కుమార్ సింగ్ చెప్పడం గమనార్హం. అయితే.. అతని విషయాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకుంటామని చెప్పడం గమనార్హం.

దీంతో.. బాధితుడికి ఏం చేయాలో అర్థం కాక తన బాధను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.  అతనికి అధికారులు నోటీసులు అందించిన విషయాన్ని కూడా అతను వీడియోలో రికార్డు చేసి.. సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.

Also Read: Aryan Khan : ఆర్యన్ విడుదలకు రూ.25 కోట్లు లంచం.. కేసులో కొత్త ట్విస్ట్...

మార్చి 15న తేజ్ ప్రకాష్ ఉపాధ్యాయ్ యాజమాన్యంలోని బకల్‌పూర్‌లోని జన్ సువిధ కేంద్రంలో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నానని, దానిని సమర్పించాల్సిందిగా తన బ్యాంక్ కోరినట్లు ఆయన తెలిపారు.

తదనంతరం, అతను బకాల్‌పూర్‌కు చెందిన సంజయ్ సింగ్ (మొబైల్ నం. 9897762706) నుండి పాన్ కార్డు తీసుకున్నానని చెప్పాడు. తాను చదువుకోలేదని.. తనకు అసలు పాన్ కార్డ్ , కలర్ ఫోటోకీ కూడా తేడా తెలీదని చెప్పడం గమనార్హం. 
 

click me!