Asianet News TeluguAsianet News Telugu

Aryan Khan : ఆర్యన్ విడుదలకు రూ.25 కోట్లు లంచం.. కేసులో కొత్త ట్విస్ట్...

aryan khan, ఇతరుల అరెస్టు సమయంలో  rave party జరిగిన నౌకపైనే ఉన్న  ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసావిని ncb అధికారులు సాక్షుల జాబితాలో చేర్చారు. ఆర్యన్ అరెస్టు తర్వాత అతనితో Gosavi  దిగిన  సెల్ఫీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Aryan Khan case: Rs 25 crore pay-off claim adds new twist, NCB's Wankhede seeks 'protection'
Author
Hyderabad, First Published Oct 25, 2021, 9:12 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ముంబై : ముంబై తీరంలో నౌక లో రేవ్ పార్టీ లో డ్రగ్స్ వ్యవహారం కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ విడుదలకు మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) అధికారులు రూ. 25 కోట్ల లంచం డిమాండ్ చేశారంటూ ఓ సాక్షి వెల్లడించారు.  

aryan khan, ఇతరుల అరెస్టు సమయంలో  rave party జరిగిన నౌకపైనే ఉన్న  ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసావిని ncb అధికారులు సాక్షుల జాబితాలో చేర్చారు. ఆర్యన్ అరెస్టు తర్వాత అతనితో Gosavi  దిగిన  సెల్ఫీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం గోసావి పరారీలో ఉన్నారు. అతని వ్యక్తిగత గన్ మెన్ ప్రభాకర్  సెయిల్ స్వచ్ఛంద సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు ఇటీవల ఎన్సీబీ ఎదుట హాజరయ్యారు. ఆదివారం ఎన్సీబీ  అధికారులపై  ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. 

‘ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యాక..  డిసౌజా అనే వ్యక్తిని gosavi కలిశాడు. నేను ఆ సమయంలో gosavi వెంటనే ఉన్నాను. ఆర్యన్‌ఖాన్‌ విడుదలకు అధికారులు రూ. 25 కోట్ల Bribe డిమాండ్ చేసినట్లు వారి మాటలను బట్టి తెలిసింది.

ఆ తర్వాత ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకున్న సందర్భంలో లంచం చుట్టే సంభాషణ సాగింది.  ఫోన్ పెట్టేశాక  ఎన్సీబీ అధికారులు చివరకు రూ. 18 కోట్లు ఇవ్వాలని గోసావి చెప్పారు. ఆ మొత్తంలో రూ. 8 కోట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్  సమీర్ వాంఖడేకు ఇవ్వాలన్నారు’’ అని మీడియాకు తెలిపారు. 
తన Testimony తీసుకున్నప్పుడు కూడా ఎన్సీబీ అధికారులు ఖాళీ పంచనామాపై, కొన్ని తెల్ల కాగితాలపై సంతకం పెట్టించారని చెప్పారు. గోసావి పరారీలో ఉన్నారని, ప్రస్తుతం తనకు సమీర్ వాంఖడే  నుంచి ప్రాణహాని ఉందని సెయిల్ ఆరోపించారు. 

తాను చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆధారాలున్నాయి అంటూ  కోర్టులో అఫిడవిట్  సమర్పించానన్నారు.  కాగా,  ఓ చీటింగ్ కేసు కు సంబంధించి గోసావిపై  పూణే పోలీసులు Lookout noticeలు జారీ చేశారు. ఎన్సీబీ అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది.

బాలీవుడ్ డ్రగ్స్ కేసు: రెండో రోజు ఎన్సీబీ విచారణకు అనన్య పాండే.. వాట్సాప్ ఛాట్‌‌పై ప్రశ్నల వర్షం

భగ్గుమన్న విపక్షాలు
సెయిల్ ఆరోపణలు  ఆదివారం  Social mediaలో వైరల్ అవడంతో..  విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై భగ్గుమన్నాయి.  OppositionLeadersను కేంద్ర దర్యాప్తు సంస్థలతో భయబ్రాంతులకు గురిచేయిస్తోందని విమర్శించాయి.  మహారాష్ట్ర సీఎం  ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే ఈ కేసులో కేంద్రం తీరు పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

మహారాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేసేందుకే ఈ చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.ఆ వ్యాఖ్యలు ఇప్పుడు నిజమవుతున్నాయి అని Shiv Sena ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. 

ఎన్‌సీబీ లంచం డిమాండ్, సాక్షితో white paptersపై సంతకాలు వ్యవహారంలో దర్యాప్తు జరిపించాలని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ ను కోరారు. ఎంసీబీ కార్యాలయంలో ఆర్యన్ ఖాన్ తో గోసావి ఫోన్ మాట్లాడిస్తున్నట్లు ఉన్న ఓ వీడియోను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు.

ఎన్‌సీబీ అధికార ప్రతినిధి, మహారాష్ట్ర మంత్రి Nawab Malik కూడా ఎన్‌సీబీ తీరును ఎండగట్టారు. Sameer Wankhede బెదిరింపులకు పాల్పడుతున్న ట్లు ఆధారాలున్నాయని, ముందు నుంచి ఈ డ్రగ్స్ కేసు ‘ఫేక్’ అని చెబుతూ వచ్చానని ఆయన అన్నారు.

సోమవారం ముఖ్యమంత్రిని కలిసి లంచం,  ఖాళీ కాగితాలపై సాక్షి సంతకం కి సంబంధించి సిట్ దర్యాప్తు కోరుతానని చెప్పారు.  కేంద్ర మంత్రి రాందాస్‌ ఆఠవాలే ఈ ఆరోపణలను ఖండించారు నవాబ్ మాలిక్ మేనల్లుడు సమీర్‌ఖాన్‌ను ఇంతకుముందు డ్రగ్స్ కేసులో సమీర్ వాంఖడే  అరెస్టు చేశారని గుర్తు చేశారు. సమీర్ వాంఖడే  వెనుకబడిన తరగతులకు చెందిన అధికారి కావడం వల్లే.. ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్సీబీ ఖండన…
 ప్రభాకర్  సెయిల్ ఆరోపణలను ఖండిస్తూ ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముఠా అశోక్ జెన్ ఓ ప్రకటన విడుదల చేశారు.  ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో తన ఆరోపణలను కోర్టులో  చెప్పుకోవాలి  తప్ప...మీడియాకు ఎక్క కూడదని చెప్పారు. ఈ ఆరోపణలను సమీర్ వాంఖడే నిర్ద్వందంగా ఖండించారని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios