UP Lockup Death.. ఐదుగురు పోలీసుల సస్పెన్షన్..

By AN TeluguFirst Published Nov 10, 2021, 11:17 AM IST
Highlights

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో "toiletకి వెళ్లాలని అడిగాడు" అని చెబుతూ.. తాము అందుకు అనుమతినిచ్చామని అయితే.. టాయిలెట్ లోకి వెళ్లిన వ్యక్తి చాలాసేపైనా తిరిగి రాకపోవడంతో పోలీసులు లోపలికి వెళ్లి చూడగా శవమై కనిపించాడని చెప్పుకొచ్చారు. 

ఉత్తరప్రదేశ్: రాష్ట్ర రాజధాని లక్నోకు పశ్చిమాన 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న UttarPradeshలోని ఎటాహ్ జిల్లాలో 22 ఏళ్ల వ్యక్తి మంగళవారం పోలీసు స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.

"మహిళను కిడ్నాప్ చేసి బలవంతంగా వివాహం చేసుకున్నాడని’’   గత వారం దాఖలైన కేసు విచారణ కోసం అల్తాఫ్ అనే వ్యక్తిని మంగళవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. కాగా, అతను suicideకు పాల్పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ట్విట్టర్‌లో విడుదల చేసిన వీడియో ప్రకటనలో, ఎటా పోలీస్ చీఫ్ రోహన్ ప్రమోద్ బోత్రే ఈ ఘటన గురించి తెలుపుతూ... ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో "toiletకి వెళ్లాలని అడిగాడు" అని చెబుతూ.. తాము అందుకు అనుమతినిచ్చామని అయితే.. టాయిలెట్ లోకి వెళ్లిన వ్యక్తి చాలాసేపైనా తిరిగి రాకపోవడంతో పోలీసులు లోపలికి వెళ్లి చూడగా శవమై కనిపించాడని చెప్పుకొచ్చారు. 

"Altaf నల్లటి జాకెట్ వేసుకున్నాడు. ఆ జాకెట్ కు ఉన్న తాడుతో వాష్‌రూమ్‌లోని ట్యాప్‌కు కట్టి గొంతుకు ఉరివేసుకోవడానికి ప్రయత్నించాడు. అనుమానంతో తలుపులు పగలగొట్టి చూసే సమయానికి అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతన్ని బయటికి  తీసుకువచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తరువాత 5-10 నిమిషాలకే అతను మరణించాడు" అని పోలీసు చీఫ్ చెప్పారు.

ఈ కేసులో ‘negligence’ కారణంగా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, అల్తాఫ్ తండ్రి చాంద్ మియాన్ మాట్లాడుతూ: "నేను నా బిడ్డను పోలీసులకు అప్పగించాను. వారు నా బిడ్డను ఉరి వేసుంటారని నా అనుమానం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

దేశంలోని అన్ని పోలీసు స్టేషన్లు, సీబీఐ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తో సహా దర్యాప్తు ఏజెన్సీలు night vision, ఆడియో రికార్డింగ్‌తో కూడిన సీసీటీవీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని గతేడాది డిసెంబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశించింది.

థానేలో దారుణం: మంచినీళ్ల కోసం వచ్చి వృద్దురాలిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం

రాష్ట్రాలు అన్ని పోలీసు స్టేషన్లలో ఆడియో కెమెరాలను ఏర్పాటు చేయాలని కోర్టు పేర్కొంది. విచారణ గదులు, లాక్‌అప్‌లు, ఎంట్రీలు, నిష్క్రమణలను సెక్యూరిటీ కెమెరాలు కవర్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే,  ఉత్తరప్రదేశ్‌లోని ఎన్ని పోలీస్ స్టేషన్లలో ఇప్పటివరకు సీసీటీవీలు ఉన్నాయో స్పష్టంగా తెలియలేదు.

తెలంగాణలో లాకప్ డెత్.. కాంగ్రెస్ నేతలు సీరియస్...
గత జులైలో తెలంగాణలో జరిగిన మరియమ్మ లాకప్ డెత్ మీద కాంగ్రెసు శాసనసభా పక్షం నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన పోరాటాన్ని కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ ప్రశంసించారు. మరియమ్మ కుటుంబానికి న్యాయం జరిపించడంలో మల్లు భట్టి విక్రమార్క విజయం సాధించారని ఆయన అన్నారు. 

మరియమ్మ కుటుంబానికి న్యాయం జరిగిందని ఆయన అన్నారు. మల్లుభట్టి విక్రమార్క మాణిక్యం ఠాగూర్ తో భేటీ అయ్యారు. తాము ప్రస్తుత తెలంగాణ రాజకీయాల గురించి చర్చించుకున్నట్లు మాణిక్యం ఠాగూర్ తెలిపారు. 

మల్లు భట్టి విక్రమార్కతో రాజకీయ, సంస్థాగత వ్యవహారాల గురించి మాట్లాడినట్లు ఆయన చెప్పారు. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో కాంగ్రెసు ఎమ్మెల్యేలు పెట్టిన ఒత్తిడి కేసీఆర్ ప్రభుత్వం వద్ద పనిచేసిందని ఆయన అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఆ విషయాలను వెల్లడించారు. 

click me!