Corona cases in India:నిన్నటితో పోలిస్తే 13.2 శాతం కేసుల పెరుగుదల

By narsimha lodeFirst Published Nov 10, 2021, 10:40 AM IST
Highlights


నిన్నటితో పోలిస్గే కరోనా కేసులు ఇవాళ భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో 11,466 కరోనా కేుసులు నమోదయ్యాయి. మరో వైపు కరోనా మృతుల సంఖ్య 460 గా నమోదైంది. కేరళ రాష్ట్రంలోనే అత్యధికంగా మరణాలు రికార్డయ్యాయి.

న్యూఢిల్లీ: Indiaలో గత 24 గంటల్లో 11,466 కొత్త Corona కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3.43 కోట్లకి చేరింది.మరో వైపు కరోనాతో 460 మంది చనిపోయారు.నిన్న ఒక్క రోజే 12,78,728 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నిన్నటితో పోలిస్తే కరోనా కేసుల  13.2 శాతం ఎక్కువగా నమోదయ్యాయి.

నిన్న ఒక్క రోజే కరోనా నుండి 11,961 మంది కోలుకున్నారు. ఇప్పటివకు కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 3,37,87,047కి చేరింది. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,39,683 లక్షలకు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా యాక్టివ్ కేసులు 0.41 శాతానికి పడిపోయినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా యాక్టివ్  కేసుల రేటు 0.41గా నమోదైంది. కరోనా రోగుల రికవరీ రేటు 98.25 గా రికార్డైంది.  కరోనా యాక్టివ్ కేసలు 264 రోజుల కనిష్టానికి పడిపోయినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది. వారాంతపు కరోనా పాజిటివిటీ రేటు 1.20 శాతంగా నమోదైంది.  వీక్లి కరోనా పాజిటివిటీ రేటు 47 రోజుల కనిష్టానికి చేరుకొందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Also read:ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు: కేరళలో భారీగా పెరిగిన కరోనా మృతులు

రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 0.90 శాతంగా రికార్డైంది. 37 రోజులుగా 2 శాతం కంటే రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు నమోదైందని గణాంకాు చెబుతున్నాయి.దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4.61 లక్షలకు చేరుకొంది. గత 24 గంటల్లో కరోనాతో దేశంలో 460 మంది మరణించారు. అయితే కేరళ రాష్ట్రంలోనే 384 మంది చనిపోయారని ఆ రాష్ట్రం ప్రకటించింది. కరోనా మృతులకు సంబంధించి కేరళ రాష్ట్రం లెక్కలను సవరిస్తుంది. దీంతో కరోనా మృతుల సంఖ్య కేరళ రాష్ట్రంలో ఎక్కువగా నమోదౌతుంది.

ఇండియాలో 2020 ఆగష్టు 7న 20 లక్షలు, ఆగష్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు,సెప్టెంబర్ 16న 50 లక్షలకు కరోనా కేసులు చేరాయి. సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షల కేసులు దాటాయి.డిసెంబర్ 19న కోటి కేసులను దాటాయి.ఈ ఏడాది మే 4న  రెండు కోట్ల కేసులను దాటాయి.ఈ ఏడాది జూన్ 23న కరోనా కేసులు మూడు కోట్లను దాటాయి.నిన్న దేశంలోని 52,69,137 మంది వ్యాక్సిన్ తీసుకొన్నారు. ఇప్పటివరకు 109 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ వేసుకొన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

అసోంలో నిన్న కొత్తగా 247 కరోనా కేసులు నమోదయ్యాయి. అసోం రాష్ట్రంలో 6,12,798కి కరోనా కేసులు చేరుకొన్నాయి. ఢిల్లీలో నిన్న ఒక్క రోజే 33 కొత్త కేసులున్నాయి. ఢిల్లీలో 0.06 కరోనా పాజిటివిటీగా నమోదైందని ఐసీఎంఆర్ ప్రకటించింది.కేరళ రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 6409 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ రాష్ట్రంలో నిన్న 33 కరోనా కేసులు రికార్డయ్యాయి. కరోనాతో ఒక్క మరణం కూడా చోటు చేసుకోలేదు.సెప్టెంబర్ 5, అక్టోబర్ లో నలుగురు కరోనాతో ఢిల్లీ రాష్ట్రంలో చోటు చేసుకొన్నాయి.

click me!