up assembly elections 2022: విద్యార్థుల‌కు ఉచితంగా టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్‌లు !

By Mahesh Rajamoni  |  First Published Dec 11, 2021, 4:46 PM IST

up assembly elections 2022: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయ పార్టీలు ఓట‌ర్ల పైకి త‌మ‌ ఆస్త్రాల‌ను సంధిస్తున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్ష పార్టీలు ప‌లు హామీలు ప‌థ‌కాలు ప్ర‌క‌టిస్తూ దూసుకుపోతున్నాయి. ఇక అధికార పార్టీ సైతం మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.  నేపథ్యంలోనే  దాదాపు 4700 కోట్ల రూపాయ‌ల విలువైన  ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లను విద్యార్థుల‌కు అందిస్తోంది సీఎం యోగి స‌ర్కారు.
 


up assembly elections 2022:  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఏడాది ప్రారంభంలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. ఎలాగైనా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌య‌కేత‌నం ఎగుర‌వేయాల‌ని ప్ర‌ధాన పార్టీల‌న్ని ప్రణాళిక‌లు ర‌చిస్తున్నాయి. దీనిలో భాగంగా ప్ర‌చారాన్ని సైతం ముమ్మ‌రం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీలు తాము అధికారంలోకి వస్తే తీసుకురాబోయేప‌థ‌కాలు, హామీలు గురించి చెబుతూ ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోతున్నాయి. అయితే, రాష్ట్రంలో మళ్లీ తామే అధికారంలోకి వ‌స్తామ‌ని బీజేపీ నేత‌, రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. 350 కి పైగా స్థానాలు గెలుచుకుంటామ‌ని చెబుతున్నారు. మ‌ళ్లీ అధికార పీఠం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ స‌ర్కారు ఎన్నిక‌ల ప్రణాళిక‌ల‌ను ముందుకు తీసుకెళ్తోంది. ఈ నేప‌థ్యంలోనే సీఎం యోగి ఆధిత్య‌నాథ్ విద్యార్థుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. సుమారు 4700 కోట్ల రూపాయ‌ల విలువైన ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లను విద్యార్థుల‌కు ఉచితంగా అందిస్తామ‌ని తెలిపారు. 

Also Read: telangana : ఈ నెల 13 నుంచి మట్టి గణపతుల విగ్రహాల తయారీలో శిక్షణ

Latest Videos

మొత్తం 6.8 మిలియ‌న్ల మంది విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు అందిస్తామని  యోగి స‌ర్కారు తెలిపింది.  ఈ నెల 20వ తేదీ నుంచి విద్యార్థులకు వీటిని పంపిణీ చేయ‌నున్న‌మ‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. దీనికి సంబంధించిన పంపిణీ ప్రక్రియ సైతం పూర్తియయింద‌ని సీఎం ముఖ్య‌మంత్రి కార్యాల‌యం తెలిపింది.  నోడల్ ఏజెన్సీ UPDESCO నుండి దాని కొనుగోలు కోసం ఆర్థిక టెండర్ పూర్తిచేసింద‌నీ, శాంసంగ్, ఏసర్, లావా వంటి కంపెనీలు సరఫరా చేయనున్నట్టు పేర్కంది. ఆయా కంపెనీలు టాబ్లెట్‌ను రూ.12,700కు సరఫరా చేయనుండగా,  స్మార్ట్ ఫోన్‌ల‌ను రూ.10,700లకు అందిస్తున్నాయి.  అయితే, ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్‌ల‌ను మొదట సాంకేతిక విద్య, వైద్య విద్య, వృత్తి విద్యా కోర్సులు చ‌దువుతున్న విద్యార్థులకు మాత్రమే అందజేయనున్నారు. అలాగే, ఉన్నత విద్యా శాఖలోని అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వ‌నున్నారు.  ఇదిలా వుండగా, ప్రజలకు తమపై నమ్మకముందనీ, మళ్లీ తమకే అధికారం అప్పగిస్తారని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాము అనేక ప‌థ‌కాలు తీసుకోచ్చామ‌ని అన్నారు. 

Also Read: Lebanon Explosion: లెబనాన్‎లో భారీ పేలుడు..27 మంది మృతి

ఈ కార్య‌క్ర‌మం ఈ నెల 20 ప్రారంభించ‌నున్నారు. దీనికి ప్ర‌ధాని మోడీ హాజ‌రు కానున్న‌ట్టు స‌మాచారం. అయితే, ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన ఈ కార్య‌క్ర‌మం వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని తీసువ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.  ప్ర‌తిప‌క్ష పార్టీలు ఇప్పిటి బీజేపీ ప్ర‌భ‌త్వ ప‌లు వైఫ‌ల్యాను చూపుతూ ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నాయి. ఓట‌ర్ల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌డానికి అనేక ప‌థ‌కాలు, హామీలు ప్ర‌క‌టిస్తున్నాయి. ఎవ‌రీకి వారు నెక్స్ట్ తామే అధికారంలోకి వ‌స్తామ‌ని ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నిక‌ల న‌గారా మోగ‌క‌ముందే యూపీలో రాజ‌కీయాలు వెడెక్కాయి. మున్ముందు రాష్ట్ర రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Also Read: ఎన్నికలు ఏవైనా గెలుపు తెరాసదే : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 

click me!