టీచర్‌కు ఏడాదికి కోటి వేతనం సరైందేనా?: విచారణకు సర్కార్, పరారీలో టీచర్

Published : Jun 05, 2020, 06:17 PM ISTUpdated : Jun 05, 2020, 06:27 PM IST
టీచర్‌కు ఏడాదికి కోటి వేతనం సరైందేనా?: విచారణకు సర్కార్, పరారీలో టీచర్

సారాంశం

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని  ఓ స్కూల్ టీచర్ కు ఏడాదికి కోటి రూపాయాలను సంపాదించినట్టు వచ్చినట్టు వార్తలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్ ప్రస్తుతం పరారీలో ఉంది.

లక్నో:ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని  ఓ స్కూల్ టీచర్ కు ఏడాదికి కోటి రూపాయాలను సంపాదించినట్టు వచ్చినట్టు వార్తలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్ ప్రస్తుతం పరారీలో ఉంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అనామిక శుక్లా అనే ఉపాధ్యాయురాలు వివిధ ప్రాంతాల్లోని 25 స్కూల్స్ లో పనిచేసినట్టుగా అధికారులు గుర్తించారు.ఆమేథీ, ప్రయాగరాజ్, అలీఘడ్, అంబేద్కర్ నగర్, రాయ్ బరేలీ సహా వివిధ జిల్లాల్లో పనిచేసినట్టుగా ప్రభుత్వ రికార్డుల్లో చూపిస్తోంది.

also read:యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల షెడ్యూల్ ఇదీ

దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆమె కోటి రూపాయాలను సంపాదించినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ విషయమై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది.ఈ విషయమై ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సతీష్ ద్వివేది విచారణకు ఆదేశించారు.అనామిక శుక్లా సైన్స్ టీచర్ గా పనిచేస్తోంది.  కాంట్రాక్టు పద్దతిలో ఆమె పనిచేస్తోందని ప్రభుత్వం తెలిపింది.

మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా టీచర్ పై విచారణ నిర్వహించారు. కోటి రూపాయాలను టీచర్ తీసుకొన్నట్టుగా వచ్చిన వార్తలు వాస్తవం కాదని విద్యాశాఖ డైరెక్టర్ జనరల్ విజయ్ కిరణ్ ప్రకటించారు.

ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు. ఆ టీచర్ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యాయో లేవా అనే విషయాన్ని కూడ విచారణ చేపడుతున్నామన్నారు.
ఒక్క స్కూల్ తో పాటు వేర్వేరు స్కూళ్లలో ఎవరైనా పనిచేస్తే  కఠిన చర్యలు తీసుకొంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!