చెరకు రైతులకు తీపికబురు.. మద్దతు ధర పెంచిన ప్రభుత్వం, ఎంతో తెలుసా?

Published : Oct 29, 2025, 06:41 PM IST
Sugarcane

సారాంశం

చెరకు రైతులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. వారి డిమాండ్ మేరకు చెరకు మద్దతు ధరను పెంచుతూ తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది… ఈ మేరకు ప్రకటన కూడా చేసింది.    

Uttar Pradesh : చెరకు రైతులకు యోగి ప్రభుత్వం దీపావళికి ముందే పెద్ద బహుమతి ఇచ్చింది. రాష్ట్రంలో చెరకు ధరలను పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఇప్పుడు చెరకు ధర క్వింటాల్‌కు రూ.30 పెంచింది… దీంతో మేలురకం చెరకు క్వింటా ధర రూ.400, సాధారణ రకం చెరకు ధర క్వింటాల్‌కు రూ.390గా నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు దాదాపు రూ.3000 కోట్ల అదనపు లాభం చేకూరుతుంది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది చెరకు రైతులకు ఊరట, ఉత్సాహాన్ని ఇచ్చింది.

యోగి ప్రభుత్వం నాలుగోసారి చెరకు ధర పెంచింది

2017 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం నాలుగుసార్లు చెరకు ధరను పెంచిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. దీని ఫలితంగా గత ఎనిమిదిన్నర ఏళ్లలో రైతులకు రూ.2,90,225 కోట్లు చెల్లించారు. ఇది గత ప్రభుత్వాలు 10 ఏళ్లలో చెల్లించిన దానికంటే రూ.1,42,879 కోట్లు ఎక్కువ.

 చక్కెర పరిశ్రమకు కొత్త ఊపు

ప్రభుత్వ సమర్థవంతమైన నిర్వహణతో రాష్ట్రంలో 4 కొత్త చక్కెర మిల్లులు స్థాపించారు. అదే సమయంలో మూతపడిన 6 మిల్లులను తిరిగి ప్రారంభించారు. ఈ చర్యలతో చక్కెర పరిశ్రమలోకి దాదాపు రూ.12,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అలాగే, 'స్మార్ట్ చెరకు కిసాన్' వ్యవస్థ ద్వారా ఇప్పుడు చెరకు రసీదులు ఆన్‌లైన్ అయ్యాయి. దీనివల్ల మధ్యవర్తుల బెడద తప్పింది, రైతులకు నేరుగా డీబీటీ ద్వారా చెల్లింపులు అందుతున్నాయి.

ఇథనాల్ ఉత్పత్తిలో యూపీ నంబర్ వన్

ఉత్తరప్రదేశ్ కేవలం చెరకు ఉత్పత్తిలోనే కాదు, ఇథనాల్ ఉత్పత్తి, చెరకు సాగు విస్తీర్ణంలో కూడా దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దీనివల్ల రైతుల ఆదాయంలో స్థిరమైన మార్పు వచ్చిందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త బలం చేకూరిందని ప్రభుత్వం చెబుతోంది.

 గత కొన్ని నెలలుగా చెరకు ధర పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. హర్యానా ప్రభుత్వం చెరకు ధరలు పెంచడంతో, యూపీ రైతులు కూడా అదే డిమాండ్ చేశారు. ఇప్పుడు యోగి ప్రభుత్వం రైతుల ఆశను నెరవేర్చింది.

ఎరువుల సబ్సిడీలోనూ రైతులకు ఊరట

రభీ సీజన్ 2025-26 కోసం ఫాస్ఫేటిక్, పొటాసిక్ (P&K) ఎరువులపై న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ (NBS) రేట్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సీఎం యోగి చెప్పారు. రూ.37,952.29 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో ఈ నిర్ణయం రైతులకు DAP, NPKS గ్రేడ్ లాంటి ఎరువులను తక్కువ ధరలకు అందుబాటులోకి తెస్తుంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?