
Uttar Pradesh : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్ లో అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారు. ఇందులో భాగంగా పాలన, అభివృద్ధిపరమైన అంశాల్లో ప్రజల సూచనలు కోరుతూ ‘సమర్థ్ ఉత్తరప్రదేశ్-వికసిత్ ఉత్తరప్రదేశ్ @2047’ చేపట్టారు… ఈ కార్యక్రమానికి విశేష స్పందన రావడంతో కొత్త రికార్డు సృష్టించింది. ప్రజలతో నేరుగా కనెక్ట్ అయి ఉత్తరప్రదేశ్ అభివృద్ధి రోడ్‌మ్యాప్‌ను రూపొందించే ఈ ప్రచారంలో ఇప్పటివరకు 53 లక్షలకు పైగా సూచనలు అందాయి… వీటిలో 41.50 లక్షలకు పైగా ఫీడ్‌బ్యాక్ గ్రామీణ ప్రాంతాల నుంచి, 11.50 లక్షలకు పైగా పట్టణ ప్రాంతాల నుంచి వచ్చాయి.
ఈ ప్రజా భాగస్వామ్య ప్రచారంలో యువత చురుకుగా పాల్గొనడం విశేషం. సుమారు 26 లక్షల సూచనలు 31 ఏళ్లలోపు వారు సలహాలు సూచనలు ఇవ్వగా.. 25 లక్షల సూచనలు 31 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు, 2.5 లక్షలకు పైగా సూచనలు సీనియర్ సిటిజన్ల నుంచి అందాయి.
ప్రచారం కింద అందిన సూచనల్లో వ్యవసాయ రంగం ముందుంది. ఇప్పటివరకు వ్యవసాయానికి సంబంధించి 13 లక్షలకు పైగా సూచనలు రాగా, విద్యా రంగానికి 12.50 లక్షలకు పైగా, పట్టణాభివృద్ధికి 10.77 లక్షలకు పైగా ఫీడ్‌బ్యాక్ అందింది. ఇది కాకుండా పశుసంవర్ధక, డెయిరీ, పరిశ్రమలు, ఐటీ, టెక్, పర్యాటకం, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సమాజ సంక్షేమం, పట్టణ, ఆరోగ్యం, భద్రత వంటి రంగాల నుంచి కూడా లక్షలాది సూచనలు వచ్చాయి.
రాష్ట్రంలో అత్యధిక సూచనలు వచ్చిన జిల్లాల్లో జౌన్‌పూర్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి నుంచి 3.21 లక్షలకు పైగా ఫీడ్‌బ్యాక్స్ వచ్చాయి. ఆ తర్వాత సంభల్ (3 లక్షలకు పైగా), ప్రతాప్‌గఢ్ (1.76 లక్షలకు పైగా), బిజ్నోర్ (1.67 లక్షలకు పైగా), గోరఖ్‌పూర్ (1.58 లక్షలకు పైగా) టాప్ ఐదు స్థానాల్లో ఉన్నాయి. బరేలీ, బారాబంకి, సోన్‌భద్ర, గోండా, హర్దోయ్ వంటి జిల్లాల నుంచి కూడా లక్షకు పైగా సూచనలు అందాయి. ఇది ఈ మహా ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైందని తెలియజేస్తోంది..
‘సమర్థ్ ఉత్తరప్రదేశ్-వికసిత్ ఉత్తరప్రదేశ్ @2047’ కింద రాష్ట్రవ్యాప్తంగా సంభాషణ, భాగస్వామ్యాన్ని పెంచడానికి వేలాది కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటివరకు 15 నగరపాలక సంస్థలు, 212 పురపాలక సంఘాలు, 528 నగర పంచాయతీలు, 56 జిల్లా పరిషత్‌లు, 713 క్షేత్ర పంచాయతీలు, 42,666 గ్రామ పంచాయతీలలో సమావేశాలు, సదస్సులు, గోష్ఠులు జరిగాయి. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య ప్రత్యక్ష సంభాషణ ఏర్పడింది. దీనివల్ల అభివృద్ధి పథకాల కోసం క్షేత్రస్థాయి సూచనల పెద్ద నిధి సిద్ధమైంది.
2047 నాటికి ఉత్తరప్రదేశ్‌ను స్వావలంబన, సమర్థవంతమైన, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉద్దేశం. ఈ దిశగా ఈ మహా ప్రచారం ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తోంది. ఇక్కడ ప్రజల అభిప్రాయమే విధాన రూపకల్పనకు ఆధారం అవుతోంది.