స్టూడెంట్ పై అత్యాచారం.. పదమూడేళ్ల తరువాత మాజీ ఎమ్మెల్యేకు జైలుశిక్ష..

By AN TeluguFirst Published Nov 1, 2021, 9:17 AM IST
Highlights

2008లో ఆమెను అపహరించి ఆపై gang rape చేశారు. ఈ కేసులో Former MLA Yogendra Sagar సహ నిందితుడిగా ఉన్నాడు. నిందితుడు సాగర్ కు అనుకూలంగా వ్యవహరించిన పోలీసులు ఆ తరువాత కేసును మూసివేశారు. అయితే, 201లో సెషన్స్ కోర్టు ఆదేశాలతో కేసును తిరిగి తెరిచారు. 

బరేలి : కళాశాల విద్యార్థినిపై పదమూడేళ్ల క్రితం అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్ పీ) మాజీ ఎమ్మెల్యే యోగేంద్ర సాగర్ కు ఉత్తరప్రదేశ్ లోని బుదాన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 

బాధిత కుటుంబానికి రూ. 30 వేలను పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది. యువతి అత్యాచారానికి గురైన సమయంలో ఆమె వయసు 20 సంవత్సరాలు. 2008లో ఆమెను అపహరించి ఆపై gang rape చేశారు. 

ఈ కేసులో Former MLA Yogendra Sagar సహ నిందితుడిగా ఉన్నాడు. నిందితుడు సాగర్ కు అనుకూలంగా వ్యవహరించిన పోలీసులు ఆ తరువాత కేసును మూసివేశారు. అయితే, 201లో సెషన్స్ కోర్టు ఆదేశాలతో కేసును తిరిగి తెరిచారు. 

ఆ తరువాత ఈ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షణలో త్వరితగతిన పరిష్కరించేందుకు బుదాన్ లోని ఎంపీ/ఎమ్మెల్యేల కోర్టుకు బదిలీ చేశారు. శనివారం ఈ కేసులో తుది తీర్పు వెల్లడయ్యింది. 

Accused యోగేంద్ర సాగర్ ను దోషిగా తేల్చిన అదనపు జిల్లా న్యాయమూర్తి అఖిలేష్ కుమార్ యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే, 30 వేల రూపాయల జరిమానా విధించారు. 

ఆ సొమ్మును బాధిత కుటుంబానికి పరిహారంగా ఇవ్వాలని ఆదేవించారు. యోగేంద్ర సాగర్ కుమారుడు ప్రస్తుతం బుదాన్ లోని బిసౌలి నియోజకవర్గం నుంచి bjp ఎమ్మెల్యేగా ఉన్నారు. 

దళితుడిని పెళ్లి చేసుకుందని కన్నకూతురికి గుండు కొట్టించి, పుణ్యస్నానం చేయించి....


అంతకుముందు మరో దారుణం... 
ఇక గతనెలలో బయటపడ్డ మరో కేసులో.. బీఎస్పీ, ఎస్పీల జిల్లా అధ్యక్షులు నిందితులుగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో 17ఏళ్ల మైనర్ బాలికపై ఆమె తండ్రి సహకారంతో అత్యాచారానికి పాల్పడిన సమాజ్ వాది పార్టీ, బహుజన సమాజ్ వాది పార్టీ నేతలు అరెస్టయ్యారు. 

తనపై కన్నతండ్రితో సహా మరో 28 మంది అత్యాచారానికి పాల్పడినట్లు... వారిలో BSP, SP ల జిల్లా అధ్యక్షులు కూడా వున్నట్లు యువతి బయటపెట్టింది. ఆమె ఫిర్యాదుమేరకు uttar pradesh లలిత్ పూర్ జిల్లా సమాజ్ వాది పార్టీ అధ్యక్షులు  తిలక్‌ యాదవ్‌, బిఎస్పీ అధ్యక్షులు దీపక్‌ అహిర్‌వర్‌ లను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ నిఖిల్‌ పాఠక్‌ వెల్లడించారు. 

మొదట తన తండ్రి, ఆ తర్వాత అతడి సాయంతో మరికొందరు తనపై గత ఐదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారని బాధిత యువతి బయటపెట్టింది. lalitpur జిల్లాలోని పల ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేసారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

దీంతో సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మీర్జాపూర్ జిల్లాలోని ఓ హోటల్ లో దాక్కున్న తిలక్‌ యాదవ్‌, దీపక్‌ అహిర్‌వర్‌ తో పాటు ఒక ఇంజనీరును అరెస్టు చేసారు.   

లలిత్ పూర్ జిల్లా ఎస్పీ అధ్యక్షుడు తిలక్ యాదవ్ పై అత్యాచార ఆరోపణలు, అరెస్ట్ నేపథ్యంలో ఆ పార్టీ అదిష్టానం సీరియస్ అయ్యింది. మొత్తం జిల్లా పార్టీ కార్యవర్గాన్ని రద్దు చేసినట్లు సమాజ్ వాది ప్రకటించింది.  

click me!