ట్విట్టర్ లో చరిత్ర సృష్టించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. 25 మిలియన్లు దాటిన ఫాలోవర్ల సంఖ్య

Published : Jun 14, 2023, 03:26 PM IST
ట్విట్టర్ లో చరిత్ర సృష్టించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. 25 మిలియన్లు దాటిన ఫాలోవర్ల సంఖ్య

సారాంశం

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫాలోవర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నారు. తాజాగా ఆయనకు అకౌంట్ కు 25 మిలియన్లు ఫాలోవర్లు అయ్యారు. దీంతో ఆయన అత్యధిక ఫాలోవర్లు ఉన్న సీఎంగా రికార్డు నెలకొల్పారు. 

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో యూపీ సీఎం ఆదిత్యనాథ్ కొత్త రికార్డు నెలకొల్పారు. ఆయన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ 25 మిలియన్ల ఫాలోవర్ల మార్కును దాటింది. అయితే ఆయనకు సోషల్ మీడియాలో ఆయనకు ఉన్న పాపులారిటీ సెలబ్రిటీలకు కూడా లేకపోవడం గమనార్హం. ఫాలోవర్ల పరంగా అనేక మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఇంకా ఈ మార్కును చేరుకోలేదు.

ఢిల్లీ - రోహ్ తక్ హైవేను దిగ్బంధించిన రైతులు.. మళ్లీ ఈ ఆందోళనకు కారణమేంటంటే ?

ట్విట్టర్ లో ఈ సంఖ్యను దాటిన తొలి ముఖ్యమంత్రి కూడా సీఎం యోగి కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. యోగి ఎనిమిదేళ్ల వ్యవధిలోనే ఈ ఘనత సాధించారు. 2015 సెప్టెంబర్ లో ట్విట్టర్ లో తన అధికారిక హ్యాండిల్ ను ఆయన ప్రారంభించారు. 2017లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి, సుపరిపాలనతో పాటు శాంతిభద్రతల్లో విస్తృత సంస్కరణలు చేపట్టిన తీరుతో ఆయనకు ప్రజాదరణ గణనీయంగా పెరిగింది.

విచిత్రం.. నాలుగు నెలల కిందట చనిపోయాడని భావించిన వ్యక్తి.. మోమోస్ తింటూ కనిపించాడు..ఎక్కడంటే ?

ట్విట్టర్లో 25 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్న యోగి, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటి సీనియర్ నాయకులను కూడా కలిగి ఉన్న క్లబ్ లో భాగం అయ్యారు. ముఖ్యమంత్రి అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో యాక్టివ్ గా ఉంటారు. కూ యాప్ లో కూడా ఆయనకు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో మోస్ట్ యాక్టివ్ సీఎం, పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్నారు.

ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న రాజకీయ నాయకులు ఎవరంటే ? 
89.2 మిలియన్ల మంది ఫాలోవర్లతో ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన భారతీయ రాజకీయ నాయకుడిగా నిలిచారు. ఆయన తరువాతి స్థానంలో లెజెండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన రాజకీయ నాయకుడిగా నిలిచారు.

శానిటరీ ఉత్పత్తుల కొరత, రుతుక్రమ విద్యపై అవగాహన లేమి.. భారత్ లో ప్రతీ ఐదుగురిలో బడి మానేస్తున్న ఓ బాలిక..

కాగా.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని ట్విట్టర్లో ఫాలో కావడం ప్రారంభించారు. అయితే ఎలన్ మస్క్ కూడా బాగానే ఫాలో వర్స్ ఉన్నారు. ‘మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న ట్విట్టర్ అకౌంట్ 2023’ జాబితాలో బరాక్ ఒబామాను మస్క్ అధిగమించారు. ప్రస్తుతం 133 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఈ బిజినెస్ మాగ్నెట్ రోజుకు సగటున 100,000 మంది ఫాలోవర్లను సంపాదించుకుంటున్నట్టు తెలుస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్