ఆటో చార్జి విషయంలో గొడవ.. ఇద్దరు ప్రయాణికులను కత్తితో పొడిచిన డ్రైవర్.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

Published : Jun 14, 2023, 02:57 PM IST
ఆటో చార్జి విషయంలో గొడవ.. ఇద్దరు ప్రయాణికులను కత్తితో పొడిచిన డ్రైవర్.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

సారాంశం

బెంగళూరులో ఇద్దరు అన్నదమ్ములు ఆటోలో ప్రయాణించి వెళ్లారు. గమ్యం చేరిన తర్వాత ఆటో డ్రైవర్ చార్జి అధికంగా చెప్పాడు. తాము ఇవ్వబోమని ఆ అన్నదమ్ములు చెప్పారు. ఈ విషయంపైనే వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్ కత్తి తీసి వారిద్దరినీ పొడిచేశాడు. ఒకరు మరణించగా.. మరొకరు విషమంగా ఉన్నారు.  

బెంగళూరు: కర్ణాటకలో ఇద్దరు అన్నదమ్ములు ఆటో ఎక్కి ఒక చోటికి వెళ్లారు. తీరా గమ్యం చేరాక ఆటో డ్రైవర్ అధిక చార్జీ అడిగాడు. వారు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇది వారి మధ్య గొడవకు దారి తీసింది. దీంతో ఆటో డ్రైవర్ కత్తి తీసి వారిద్దరినీ పొడిచేశాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

అహ్మద్, అయూబ్‌లు ఇధ్దరూ మెజెస్టిక్ నుంచి యశ్వంత్ పూర్ రైల్వే స్టేషన్‌కు ఆటోలో వెళ్లారు. వారు గమ్యం చేరిన తర్వాత ఆటో డ్రైవర్‌కు డబ్బులు ఇవ్వబోయారు. అప్పుడే ఆటో డ్రైవర్ చార్జి పెంచి చెప్పాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. ఆటో డ్రైవర్ కత్తి తీసి వారిద్దరినీ పొడిచేశాడు.

అహ్మద్‌నుు హాస్పిటల్ తరలిస్తుండగానే మార్గం మధ్యలోనే మరణించాడు. కాగా, అయూబ్‌ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నది. తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. 

Also Read: ఇంటి బయటికి లుంగీలు, నైటీలు వేసుకోని రావొద్దు: హౌజింగ్ సొసైటీ విచిత్ర షరతులు

పోలీసులు ఆ ఆటో డ్రైవర్‌ను పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతుండగా.. హసన్ జిల్లాలో ఆ ఆటో డ్రైవర్ పై మరికొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు తేలింది.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్