UP Assembly Election 2022: తొలిసారి అసెంబ్లీ పోరులో సీఎం యోగి.. అక్క‌డ నుంచే బ‌రిలోకి

By Rajesh KFirst Published Jan 15, 2022, 3:15 PM IST
Highlights

UP Assembly Election: త్వరలో జరగబోయే  ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి.
 

UP Assembly Election: త్వరలో జరగబోయే  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నికలు రోజురోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ప్ర‌ధాన రాజకీయ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. బీజేపీ ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాల‌ని యోచిస్తోంది. కాంగ్రెస్ కూడా ఈ సారి చాలా జోష్ మీద ఉంది. ఈ క్ర‌మంలో రాజ‌కీయ‌ పార్టీలు  కులాల పరంగా, ప్రాంతాల పరంగా ఓటర్లను ఆకర్షించే ప్ర‌య‌త్నం చేస్తోన్నాయి. 

ఇదిలా ఉంటే. బీజేపీ మ‌రో ఎత్తుగ‌త వేసింది. ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాల‌ని రంగం సిద్దం చేసింది. అయితే.. అంద‌రూ ఉహించిన‌ట్టు అయోధ్య నుంచి కాకుండా.. మ‌రో నియోజక వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్నారు. అదే సొంత త‌న  నియోజ‌క వ‌ర్గం గోరఖ్​పుర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. బీజేపీ విడుదల చేసిన యూపీ అభ్యర్థుల తొలి జాబితాలో యోగి పేరు ఉండగా.. ఆయన పోటీ ఖరారైంది. యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య.. సిరాతు స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికల భాగంగా.. 107 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది.  తొలి విడత ఎన్నికల జరిగే 58 స్థానాలకు గానూ..  57 మంది అభ్యర్థుల‌ను, రెండో విడత జ‌రిగే  55 స్థానాలకు 38 మంది అభ్య‌ర్థుల‌ను ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. ఈ జాబితాలో  20మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. 

బీజేపీ ప్ర‌క‌టించినా .. 107 స్థానాల్లో 83 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా.. ఈసారి వారిలో 63మందికే మాత్రం  మరోసారి అవకాశం ఇచ్చింది  బీజేపీ అధిష్ఠానం. మిగతా 20మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టికెట్లు​ కేటాయించపోవ‌డం గ‌మ‌నార్హం. అయితే.. వీరంద‌రూ ఇతర పార్టీలపై దూక‌డానికి సిద్దంగా ఉన్న‌వార‌ని,  లేక ప్రజల్లో వ్యతిరేకత ఉన్న కారణంగానే వారికి టిక్కెట్ల‌ను కేటాయించ‌లేద‌ని ఉత్తర్​ప్రదేశ్​లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వరకు 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు లువ‌డ‌నున్నాయి. గ‌త‌ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ  312 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఎస్పీకి 49 స్థానాలు, బీఎస్పీకి 15 స్థానాలు, కాంగ్రెస్‌కు 7 స్థానాలల్లో గెలుపొందాయి.  

click me!