బీహార్‌లో విషాదం: కల్తీ మద్యానికి ఐదుగురు మృతి

By narsimha lodeFirst Published Jan 15, 2022, 2:47 PM IST
Highlights

బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యానికి ఐదుగురు మరణించారు. నలంద జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. అయితే కల్తీ మద్యం వల్లే వీరంతా చనిపోయారని అధికారులు ధృవీకరించలేదు. మృతుల కుటుంబసభ్యులు మాత్రం కల్తీ మద్యం వల్లే చనిపోయారని ప్రకటించారు.

పాట్నా:Bihar  రాష్ట్రంలోని నలందలో కల్తీ మద్యానికి ఐదుగురు మరణించారు.  spurious liquor తాగడం వల్లే ఈ ఐదుగురు చనిపోయినట్టుగా మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. కానీ ఈ విషయాన్ని అధికారులు మాత్రం ధృవీకరించడం లేదు. police సంఘటన స్థలానికి చేరుకొని ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నారు. మద్యం సేవించిన మరికొందరు ఆసుపత్రుల్లో చేరినట్టుగా సమాచారం. 

శుక్రవారం రాత్రి కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురయ్యారని మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టుగా చెప్పారు. మృతుల్లో ఒకరైన మన్నా మిస్త్రీ బంధువు సునీల్ కుమార్ ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. మద్యం తాగి రాత్రి 11 గంటలకు మన్నా ఇంటికి వచ్చినట్టుగా చెప్పారు. అప్పటికే అతని అస్వస్థతతో ఉన్నాడని చెప్పారు. అతడిని ఆసుపత్రికి తరలించామన్నారు. చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున మరణించినట్టుగా సునీల్ కుమార్ చెప్పారు.గత కొన్ని నెలలుగా చోటీ పహారీ ప్రాంతంలో దేశీయ మద్యం తయారౌతుందని సునీల్ చెప్పారు.

బీహార్ ముఖ్యమంత్రి Nitish Kumar  స్వంత జిల్లా Nalanda లో ఈ ఘటన జరగడం కలకలం రేపుతుంది.. బీహార్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమల్లో ఉంది. అయితే కల్తీ మద్యంతో ఐదుగురు మరణించడం మద్యపాన నిషేధం అమలుపై చర్చకు కారణమైంది.

బీహార్‌ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా పలువురు కల్తీ మద్యానికి బలయ్యారు.గత ఏడాది నవంబర్ మాసంలో కల్తీ మద్యం సేవించి 50 మంది మరణించారు. బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో నవంబర్ మాసంలో కల్తీ మద్యానికి ఎనిమిది మంది చనిపోయారు. అంతకుముందు ముజఫర్‌పూర్ లో ఐదుగురు చనిపోయారు. గోపాల్‌గంజ్‌లో ఎనిమిది మంది చనిపోయారు. నమస్తపూర్ లో పలువురు కల్తీ మద్యం సేవించి చనిపోయారు.

గత ఏడాది  జూలైలో బీహార్ లోని పశ్చిమ చంపారన్‌లోని హుచ్ లో  కల్తీ మద్యం తాగి 16 మంది మరణించారు. బీహార్‌ రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేస్తున్న నాటి నుండి కల్తీ మద్యంతో మరణించేవారి సంఖ్య పెరుగుతుంది. మద్యపాన నిషేధం వల్ల రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్తుతుందని సీఎం నితీష్ కుమార్ పేర్కొన్నారు. తాను కూడా మద్యానికి దూరంగా ఉంటానని సీఎం నితీష్ కుమార్ ప్రమాణం చేశారు.గత ఏడాది నవంబర్ 26న  సీఎం నితీష్ కుమార్ సహా అధికాులు మద్యం ముట్టబోమని ప్రమాణం చేశారు. ప్రజలు కూడా మద్యానికి దూరంగా ఉండాలని కోరారు.

బీహార్ రాష్ట్రంలో గత ఏడాది కల్తీ మద్యం విషయమై రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. 75 వేల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 1800 మంది జైలు నుండి విడుదలయ్యారు. 2021లో కల్తీ మద్యంతో 253 మంది మరణించినట్టుగా పోలీస్ శాఖ నివేదికలు చెబుతున్నాయి. కల్తీ మద్యం సరఫరా చేస్తున్న 13,839 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

2016లో గోపాల్‌గంజ్ లో కల్తీ మద్యం తాగి 19 మంది మరణించారు. మరో ఇద్దరు కంటిచూపును కోల్పోయారు. ఈ కేసులో గోపాల్ గంజ్ కోర్టు తొమ్మిది మందికి మరణశిక్ష విధించింది. నిందితుల్లో నలుగురు మహిళలకు కోర్టు జీవితఖైదు విధించింది.2016 ఏప్రిల్ 5 నుండి మధ్యనిషేధం అమల్లో ఉంది.

click me!