‘కంగనా చెంపల కంటే మా రోడ్లు మృధువుగా ఉంటాయి’.. జార్ఖండ్ ఎమ్మెల్యే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

By team teluguFirst Published Jan 15, 2022, 2:48 PM IST
Highlights

తమ రోడ్లు కంగనా రనౌత్ చెంపల కంటే మృధువుగా ఉంటాయంటూ జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మాస్క్ లు ఎక్కువ సేపు ధరించవద్దని, ధరిస్తే కార్బన్ డై ఆక్సైడ్ పీల్చే అవకాశం ఉంటుందంటూ రెండు రోజుల కిందట కూడా వ్యాఖ్యలు చేశారు. 

జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ (congress mla irfan ansari) మ‌రో సారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలిచారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిని అభివృద్ధి ప‌నులను వివ‌రిస్తూ మ‌రో సారి నోరుజారారు. రోడ్ల సున్నిత‌త్వాన్ని సినీ న‌టి కంగ‌నా ర‌నౌత్ (actor kangana ranaut) చెంప‌లతో (cheeks) పోలుస్తూ వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు ఆయ‌న విడుద‌ల చేసిన సెల్పీ వీడియో వివాదంగా మారింది. 

ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ విడుద‌ల చేసిన సెల్పీ వీడియోలో (selfe video) ‘‘ సినిమా నటి కంగనా రనౌత్ చెంపల కంటే జమతారా రోడ్లు సున్నితంగా నిర్మిస్తాన‌ని హామీ ఇస్తున్నాను ’’ అంటూ చెప్తూ పోయారు. తన నియోజకవర్గంలోని జమతారాలో 14 ప్రపంచ స్థాయి రోడ్ల నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా గ‌త బీజేపీ (bjp) ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. బీజేపీ హయాంలో ఇలాంటి రోడ్లు ఎప్పుడూ నిర్మించలేదని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఆ పార్టీ కేవ‌లం రాష్ట్రాన్ని దోచుకునే పని చేసిందని తీవ్రం ఆరోపించారు. 

రోడ్లపై వాహ‌న రాక‌పోక‌ల వ‌ల్ల వెలువ‌డే దుమ్ము కారణంగా ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నార‌ని చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్పుడు ఏర్ప‌డిన‌ప్ప‌డు స్థానికుల కోసం అభివృద్ధి పనులు చేస్తానని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో 14 రోడ్ల‌ను ఆమోదించాను. ఇప్పుడు అవి టెండ‌ర్ కు వెళ్తాయ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే నిర్మాణ ప‌నులు ప్రారంభ‌మవుతాయ‌ని ఎమ్మెల్యే చెప్పారు. 

రెండు రోజుల కింద‌ట కూడా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే (congress mla) చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. క‌రోనా విజృంభిస్తున్న ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. మాస్కులు (masks) ఎక్కువ సేపు ధ‌రించవ‌ద్ద‌ని.. ఇలా చేస్తే కార్బ‌న్ డై ఆక్సైడ్ (carbon dioxide)
పీల్చే అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌ని అన్నారు. ప్ర‌స్తుతం అంద‌రూ ప్రజాప్ర‌తినిధులు, అధికారులు మాస్కులు ధ‌రించాలని సూచిస్తుంటే.. స్వ‌త‌హాగా డాక్ట‌ర్ అయిన ఎమ్మెల్యే మాత్రం ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. రెండు రోజుల కింద‌ట ధ‌న్ బాద్లో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న మాస్క్ ధ‌రించ‌లేదు. దీంతో అక్క‌డున్న మీడియా ప్ర‌తినిధులు ఎమ్మెల్యే తీరును ప్ర‌శ్నించారు. దీనికి ఆయ‌న స‌మాధానం ఇచ్చారు. మాస్క్ లు ఎక్కువ సేపు ధ‌రించ‌కూడద‌ని, తాను ఒక డాక్ట‌ర్ గా ఈ విష‌యం చెబుతున్నాన‌ని అన్నారు. మాస్క్ లు అధికంగా ధ‌రించ‌డం వ‌ల్ల ముక్కు నుంచి వ‌చ్చే కార్బ‌న్ డై ఆక్సైడ్ ను మ‌ళ్లీ పీల్చే అవ‌కాశం ఉంటుంద‌ని అన్నారు. 

అయితే గ‌తంలో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ (rjd leader, bihar former cm lalu prasad yadav) కూడా హీరోయిన్ చెంప‌ల‌పై వ్యాఖ్య‌లు చేసి వివాద‌స్ప‌దం అయ్యారు. బీహార్ రోడ్లను బాలీవుడ్ నటి హేమమాలిని చెంపలలాగా తీర్చిదిద్దాలని ఏడేళ్ల క్రితం అన్నారు. ఈ ప్ర‌క‌ట‌న‌పై అప్ప‌ట్లో పెద్ద దుమార‌మే రేగింది. ఇప్పుడు మ‌ళ్లీ ఇర్ఫాన్ అన్సారీ కూడా అలాంటి వ్యాఖ్య‌లే చేశారు. 

click me!