UP Assembly Election 2022: కాషాయంలో క‌ల‌వ‌రం.. 20 నాటికి 18 మంది మంత్రుల రాజీనామా !

By Mahesh RajamoniFirst Published Jan 13, 2022, 9:58 AM IST
Highlights

 UP Assembly Election 2022: యూపీలో మ‌ళ్లీ అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తున్న బీజేపీకి దెబ్బ మీద బెబ్బ‌లు త‌గులుతున్నాయి. రాష్ట్ర బీజేపీ కీల‌క నేత‌లు ఆ పార్టీకి రాజ‌నీనామా చేసి ఇత‌ర పార్టీల్లో చేరుతున్నారు. మ‌రీ ముఖ్యంగా రాష్ట్ర మంత్రులు సైతం రాజీనామా చేయ‌డంతో క‌మ‌లంలో క‌ల‌వ‌రం మొద‌లైంది.  ఎన్నిక‌ల ముందు కీల‌క నేత‌లు నేత‌లు రాజీనామా చేయ‌డం క‌మ‌లం పార్టీలో గుబులు పుట్టిస్తున్న‌ది. 
 

UP Assembly Election 2022: దేశంలో త్వ‌ర‌లో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి. దీంతో ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా అన్ని పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోయే రాష్ట్రాల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్‌, గోవా, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అయితే, అధికారం ద‌క్కించుకోవాల‌ని స‌మాజ్ వాదీ పార్టీ, బీజేపీలు గ‌ట్టిగానే ప్రయ‌త్నం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో రాష్ట్ర రాజ‌కీయాల్లో ఊహించ‌ని ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి.  మ‌ళ్లీ అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తున్న బీజేపీకి దెబ్బ మీద బెబ్బ‌లు త‌గులుతున్నాయి. రాష్ట్ర బీజేపీ కీల‌క నేత‌లు ఆ పార్టీకి రాజీనామా చేసి ఇత‌ర పార్టీల్లో చేరుతున్నారు. మ‌రీ ముఖ్యంగా రాష్ట్ర మంత్రులు సైతం రాజీనామా చేయ‌డంతో క‌మ‌లంలో క‌ల‌వ‌రం మొద‌లైంది.  24 గంటల వ్యవధిలోనే ఇద్దరు క్యాబినెట్‌ మంత్రులు సహా ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పడం కాషాయ నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నది. మరికొద్ది రోజుల్లో పార్టీని వీడే వారి సంఖ్య అధికంగా ఉండ‌నుంద‌ని రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ న‌డుస్తోంది. 

బీజేపీని వీడుతున్న మంత్రులు, కీల‌క నేత‌లు ఈ సారి ఎన్నిక‌ల్లో జ‌య‌కేత‌నం ఎగుర‌వేసి అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తున్న రాష్ట్ర మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్ వాదీ పార్టీలోకి జంప్ అవుతున్నారు. మ‌రికొంత మంది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడనున్నారన్న వార్తలు కమలదళంలో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మున్ముందు యూపీ ముఖ్య‌మంత్రి క్యాబినెట్ తో పాటు ఆ బీజేపీని వీడే వారి సంఖ్య పెరుగుతుంద‌ని  ఓబీసీ నేత, సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ చీఫ్‌ ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్  అన్నారు. ప్ర‌తిరోజు ఇద్ద‌రు మంత్రుల‌తో పాటు ఎమ్మెల్యేలు వ‌రుస పెట్టి భార‌తీయ జ‌న‌తా పార్టీని వీడుతార‌ని తెలిపారు. ఈ నెల 20 నాటికి ఏకంగా 18 మంత్రులు బీజేపీకి రాజీనామా చేయ‌డం ఖాయ‌మ‌ని  ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్ పేర్కొన‌డం సంచ‌ల‌నంగా మారింది. రాష్ట్ర బీజేపీలో క‌ల‌వ‌రం మొద‌లైంది. ‘దళితులు, వెనుకబడిన వర్గాలపై బీజేపీ నిర్లక్ష్యాన్ని నేను గతంలోనే అర్థం చేసుకొన్నాను. అందుకే పొత్తు నుంచి బయటకు వచ్చాను. వీళ్లు ఇన్ని రోజులు ఓపిక పట్టారు. నిరాశ తప్ప వారికి ఏం మిగల్లేదు. ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు’ అని రాజ్‌భర్‌ అన్నారు.

కాగా, బీజేపీ ఎమ్మెల్యే అవతార్ సింగ్ భదానా బుధవారం బీజేపీని వీడారు. త్వరలోనే ఆయన సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ దళ్‌లో చేరనున్నారు. కాగా, మరో ముగ్గురు ఎమ్మెల్యేలూ పార్టీకి తమ రాజీనామాలు ప్రకటించారు. ఈ ముగ్గురూ మౌర్యకు మద్దతుగానే రాజీనామా చేసి ఉంటారని యోచిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే బ్రజేష్ ప్రజాపతి, రోషన్ లాల్ వర్మ, భగవతి సాగర్‌లు తమ రాజీనామాలు ప్రకటించారు. వీరితోపాటు సోమవారం బీజేపీ ఎమ్మెల్యే రాధా క్రిష్ణ శర్మ కూడా రాజీనామా చేశారు. ఆయన సమాజ్ వాదీ పార్టీలో చేరారు. అంతకు ముందే దిగ్విజయ్ నారాయణ్ చౌబే కూడా బీజేపీని వీడి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. వీరిద్దరూ బీజేపీలోని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు.  త్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ సుశీల్ చంద్ర ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ గడువు మే నెలతో ముగియ‌డంతో.. మొత్తం 400 కు పైగా అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి ఎన్నిక‌ల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 27, మార్చి 3,  మార్చి 7 తేదీల్లో మొత్తం 7 దశల్లో ఓటింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి. 

click me!