Covid in India: భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్క రోజే 2.47 లక్షల మందికి కరోనా..

Published : Jan 13, 2022, 09:56 AM ISTUpdated : Jan 13, 2022, 10:06 AM IST
Covid in India: భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్క రోజే 2.47 లక్షల మందికి కరోనా..

సారాంశం

భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజువారి కొత్త కేసులు సంఖ్య భారీగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,47,417 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ (Union Health Ministry) గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది

భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజువారి కొత్త కేసులు సంఖ్య భారీగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,47,417 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ (Union Health Ministry) గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. అయితే గత 8 నెలల కాలంలో ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా కరోనాతో 380 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,85,035కి చేరింది. 

దేశవ్యాప్తంగా నిన్న కరోనా నుంచి  84,825 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,47,15,361కి చేరింది. రికవరీ రేటు 95.59 శాతంగా ఉంది. ఇక, దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో 11,17,531 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల శాతం 3.08గా ఉంది. 

ప్రస్తుతం దేశంలో రోజువారి కరోనా పాజిటివిటీ రేటు 13.11 శాతంగా ఉంది. ఇదిలా ఉంటే వీక్లీ పాజిటివిటీ రేటు 10.80 శాతంగా ఉంది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. బుధవారం దేశంలో 76,32,024 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో దేశంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,54,61,39,465కి చేరింది. కరోనా పరీక్షల విషయానికి వస్తే.. జనవరి 12న దేశవ్యాప్తంగా 18,86,935 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటివరకు మొత్తంగా 69,73,11,627 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా వెల్లడించింది. 

మరోవైపు ఒమిక్రాన్ (Omicron) కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. దేశంలో కొత్తగా 620 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా..  ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 5,488కి చేరింది. వారిలో 2,162 కోలుకున్నట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 1,367 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో 792 కేసులతో రాజస్తాన్‌ ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gratuity : ఉద్యోగులకు పండగే.. ఇక ఐదేళ్లు అక్కర్లేదు, ఏడాదికే గ్రాట్యుటీ.. కొత్త రూల్స్ ఇవే
Custom Duty Cut : గుడ్ న్యూస్.. షాంపూ నుండి మందుల దాకా.. ఇవన్నీ చవకమ్మ చవక !