PM Security lapse : ప్రధాని హత్యకు కుట్ర.. పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీని అరెస్ట్ చేయాలి.. అసోం సీఎం...

By SumaBala BukkaFirst Published Jan 13, 2022, 8:27 AM IST
Highlights

‘ప్రధానమంత్రిని హత్య చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, పంజాబ్ సీఎం కుట్ర పన్నినట్లు లభించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ కుట్రలో భాగమైన పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీని అరెస్టు చేయాలి’ అని బిశ్వ శర్మ అన్నారు.

డిస్పూర్ :  ప్రధానమంత్రి narendra modiని హత్య చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని అసోమ్ ముఖ్యమంత్రి Himanta Bishwa Sharma ఆరోపించారు.  పంజాబ్ ముఖ్యమంత్రి Charanjit Singh Channi ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని పర్యటనలో Security failureపై ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు.

‘ప్రధానమంత్రిని murder చేసేందుకు congress పార్టీ అధిష్టానం, పంజాబ్ సీఎం కుట్ర పన్నినట్లు లభించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ కుట్రలో భాగమైన సీఎంను అరెస్టు చేయాలి’ అని బిశ్వ శర్మ అన్నారు. జనవరి 5న పంజాబ్లో ప్రధాని మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో ప్రధానిని హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆ రాష్ట్ర పోలీసులలకు జనవరి 2వ తేదీనే నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిందని... ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీఎం హిమంత ఆరోపించారు. 

ఓ టీవీ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి అని చెప్పారు. ఈ ఘటన తర్వాత కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు సైతం ఈ కుట్ర గురించి వారికి ముందే తెలుసు అన్నట్లుగా  ఉన్నాయన్నారు. పంజాబ్లో ఫిరోజ్పూర్ జిల్లాకు ప్రధాని మోదీ వెళుతుండగా ఆందోళనకారులు రహదారిని దిగ్బంధించడంతో ఆయన వాహనశ్రేణి 20 నిమిషాలపాటు ఫ్లై ఓవర్ పై చిక్కుకుపోయింది. 

దీంతో ఆయన బహిరంగ సభ సహా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనకుండా వెనుతిరిగారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. భద్రత వైఫల్యంపై ఉన్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. 

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో చోటుచేసుకన్న భద్రతా వైఫల్యంపై విచారణకు సంబంధించి సుప్రీం కోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఘటనపై సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి ఇందు మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు ఈరోజు తెలిపింది. ఈ విచారణలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు, పంజాబ్ పోలీసులు విచారణలో భాగం కానున్నారని వెల్లడించింది. 

ఈ కమిటీలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, చంఢీఘర్ పోలీస్ చీఫ్, డైరెక్టర్ జనరల్‌ (సెక్యూరిటీ) ఆఫ్ పంజాబ్, పంజాబ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సభ్యులుగా ఉండనున్నారు. "ఈ ప్రశ్నలను ఏ ఒక్క పక్షం విచారణపై వదిలిపెట్టలేము. మాకు స్వతంత్ర దర్యాప్తు అవసరం" అని సుప్రీంకోర్టు పేర్కొంది.

జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలోని విచారణ కమిటీ.. భద్రతా ఉల్లంఘనకు కారణమేమిటో, ఎవరు బాధ్యులు, భవిష్యత్తులో ఇటువంటి లోపాలను నివారించడానికి ఎలాంటి రక్షణలు అవసరమో విచారించి.. నివేదికను వీలైనంత త్వరగా సమర్పిస్తుందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తెలిపింది.

గత వారం ప్రధాని మోదీ పంజాబ్‌ పర్యటనకు వెళ్లారు. ఆయన బఠిండా నుంచి ఫిరోజ్‌పూర్‌కు రోడ్డు మార్గంలో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో ఓ ఫ్లై ఓవర్‌పై మోదీ కాన్వాయ్ దాదాపు 15 నుంచి 20 నమిమిషాల పాటు నిలిచిపోయింది. దీనిపై కేంద్ర హోం శాఖ తీవ్రంగా స్పందించింది. పంజాబ్ ప్రభుత్వం నుంచి నివేదిక కోరడంతో.. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. 

click me!