భార్యతో అసహజ శృంగారం.. వీడియో తీసి.. రూ.కోటి డిమాండ్.. సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్..

Published : Jul 04, 2022, 01:18 PM IST
భార్యతో అసహజ శృంగారం.. వీడియో తీసి.. రూ.కోటి డిమాండ్.. సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్..

సారాంశం

భార్యతో అసహజ శృంగారానికి ఒత్తిడి చేశాడు భర్త. అంతటితో ఆగకుండా అవి వీడియోలు తీశాడు. కోటి రూపాయలు ఇవ్వకపోతే ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. 

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఒక దారుణ ఘటన జరిగింది. ఓ భర్త అసహజ శృంగారం చేయమంటూ భార్యను వేధింపులకు గురిచేశాడు. దీంతో తనను అసహజ లైంగిక కార్యకలాపాలతో ఇబ్బంది పెట్టాడని భర్తపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాదు, తన నగ్న వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ లోని లసుడియా పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు పెట్టింది.   

తన ఫిర్యాదులో భర్త తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. కోటి రూపాయలు ఇవ్వాలని  డిమాండ్ చేస్తున్నాడని పేర్కొంది.  ఆ డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని  పేర్కొంది. తన భర్తకు అత్తమామలు కూడా సహకరించాలని,  వారిపై కూడా కేసు పెట్టింది. బాధితురాలి భర్త స్వస్థలం  కాన్పూర్. దీనివల్ల పోలీసులు ఈ కేసును  కాన్పూర్ కు బదిలీ చేశారు.

ఇలాంటి ఘటనే  గతంలోనూ చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని పూణే లో 2018లో ఈ ఘటన  జరిగింది. పూనేలోని  ప్రభాత్ రోడ్డు ప్రాంతానికి చెందిన డాక్టర్ కు 2016లో వివాహమైంది. అయితే, అతనిమీద భార్య 2018లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.  వివాహం అయినప్పటి నుంచి తనను భర్త అసహజ శృంగారం  చేయమని  ఒత్తిడి తీసుకు వచ్చాడని  పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తనను పూనెలోని అత్తగారింట్లోనూ.. హనీమూన్ కు ఇండోనేషియా దేశానికి వెళ్లినప్పుడూ అసహజ శృంగారానికి భర్త వేదించేవాడని భార్య వెల్లడించింది. 

అంతేకాదు తనతో అసహజ శృంగారానికి అంగీకరించకుంటే విడాకులు ఇస్తానని తన భర్త వేదించాడని, దీంతోపాటు తనను అత్తామామలు కూడా వెధించారని కోడలు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు బుల్దానా పోలీసులు ఐపీసీ సెక్షన్  376, 377, 328, 342, 498 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  నిందితుడైన డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. 

విద్యార్థుల తల్లులకు అసభ్యకర మెసేజ్ లు, వీడియోలు.. కీచక టీచర్ సస్పెండ్...

ఇదిలా ఉండగా, 2018లో బెంగళూరులో అసహజశృంగారం కోసం భర్త వేధిస్తుండడంతో తట్టుకోలేక ఒక వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చోటు చేసుకుంది. సదరు భర్త మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఓ మహిళ టీచర్ గా పనిచేస్తుంది. ఆమెకు పెళ్లై, ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. పెల్లైన కొత్తలో భర్త బాగానే ఉన్నాడు.

ఆ తరువాత కొద్ది కాలానికి అసహజశృంగారం కోసం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. కొద్ది కాలం ఈ వేధింపులు మౌనంగా భరించింది. అయితే, రాను రాను ఈ వేధింపులు ఎక్కువ కావడంతో భర్త నుంచి దూరంగా వెళ్లి.. పుట్టింట్లో ఉంటుంది. అలా ఘటనకంటే ముందు సంవత్సరం నుంచి పుట్టింట్లోనే ఉంటుంది. 

ఈ క్రమంలో పిల్లాడిని చూడడానికి అత్తగారింటికి వచ్చిన భర్త..మళ్లీ పాత పాటే అందుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి భార్యను అసహజ శృంగారానికి బలవంతం చేశాడు. దీంతో విసుగెత్తిన ఆమె భర్తతో గొడవకు దిగింది. తిరస్కరించింది. అయినా వేధించడం ఆపకపోవడంతో.. నిద్రమాత్రలు మింగింది. చేతిని బ్లేడుతో కోసుకుంది. అంతలో వచ్చిన కుటుంబసభ్యలు ఇది గమనించి.. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu