కుక్క మొరిగిందని.. శునకంతో పాటు మరో ముగ్గురిపై ఇనుపరాడ్ తో దాడి..

Published : Jul 04, 2022, 11:49 AM IST
కుక్క మొరిగిందని.. శునకంతో పాటు మరో ముగ్గురిపై ఇనుపరాడ్ తో దాడి..

సారాంశం

ఢిల్లీలోని పశ్చిమ్‌ విహార్‌లో కుక్క మొరిగిందని.. ఇరుగుపొరుగు వారిని ఇనుప రాడ్‌తో కొట్టాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులతో పాటు.. కుక్కకూ గాయాలయ్యాయి.

ఢిల్లీ : ఇటీవలి కాలంలో పెంపుడు కుక్కల్ని పెంచుకోవడం చాలా ఎక్కువయ్యింది. అపార్టుమెంటుల్లో కూడా కుక్కల్ని పెంచుకుంటున్నారు. వీటివల్ల పక్కింటి వారితో, ఎదురింటి వారితో గొడవలు కూడా కామన్ అయిపోయాయి. సమయసందర్భాలు లేకుండా వాటి అరుపులు, ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్ణన, మల విసర్జన చేయడాలు.. ఎదుటివారిని చికాకుకు గురిచేయడమే దీనికి కారణం. ఇక కుక్కలు కూడా కొత్తవారిని చూస్తే చాలు భయపెట్టేలా అరుస్తూ దడ పుట్టిస్తాయి.

కొన్నిసార్లు రోజూ చూసే మనుషులే అయినా.. తమ యజమాని ఇంటికో.. ఆ దారి దాపులకో వస్తే మాత్రం ఊరుకోవు. అరిచి గోల పెట్టి.. విసిగిస్తాయి. అలాగే ఓ వ్యక్తిని పక్కింటి కుక్క పదే పదే చూస్తూ మొరగడం.. నిత్యం దాని అరుపులు వినీ వినీ విసిగెత్తి పోయిన అతను దారుణానికి తెగించాడు. ఏకంగా ఆ కుక్కను, దాని యజమాని, మరో ఇద్దరి మీద దాడి చేసి ఇనుపరాడ్ తో కొట్టి గాయపరిచాడు. ఈ ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. 

బహిర్భుమికి వెళ్లిన మైనర్ అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్.. ఐదుగురు అరెస్ట్..

పక్కింటివాళ్ల పెంపుడు కుక్క తనను చూసి మొరిగిందని ఓ వ్యక్తి.. ఆ కుక్కను పెంచుకుంటున్న ఇంటివారిని ఇనుప రాడ్ తో బాదాడు. పొరుగింట్లో ఉన్న వారి మీద దాడిచేసి ఇనుప రాడ్ తో ముగ్గురిని గాయపరిచాడు. అంతటితో ఆగలేదు తనను చూసి మొరిగిన కుక్కను కూడా ఇనుప రాడ్‌తో కొట్టి గాయపరిచాడు.ఈ ఘటన ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ ప్రాంతంలో చోటుచేసుకుంది.సీసీటీవీ ఫుటేజీలో, ఆ వ్యక్తి కుక్కను రాడ్‌తో కొట్టడం, ఆపై కుక్క యజమానిని కొట్టడం రికార్డ్ అయ్యింది. అతను దాడి చేస్తుండగా. కుటుంబంలోని వేరే వ్యక్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వాళ్లను కూడా అతను తలపై కొట్టాడు. దీనిమీద పశ్చిమ విహార్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. "రక్షిత్ (కుక్క యజమాని) వాంగ్మూలంపై పశ్చిమ విహార్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఐపిసి, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది" అని పోలీసులు తెలిపారు.

గతంలో నైరుతి ఢిల్లీలోని దబ్రీ ప్రాంతంలో ఇలాగే కుక్క విషయంలో రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. జితేంద్ర పాండే,  వినోద్ కుమార్ ల కుటుంబం దబ్రీ ప్రాంతంలో నివసిస్తుండేది. వినోద్ ఇంట్లో కుక్కను పెంచుకునేవారు. ఇది పక్కింట్లో ఉన్న జితేంద్ర పాండే ఇంటి ముందు  చెత్త చేస్తుండేది.. అక్కడే వన్, టూ పోతుండేది. దీంతో జితేంద్రపాండే కుటుంబానికి ఇది చిరాకుగా మారింది. ఎన్నిసార్లు చెప్పినా వినోద్  వినిపించుకోనట్టే ఉండేవాడు.  దీంతో ఒక రోజు ఇదే విషయమై జితేంద్ర పాండే  వినోద్ కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు, ఈ క్రమంలో  ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది.ఆ ఘర్షణలో వినోద్, వినోద్ భార్య, వినోద్ కూతురు గాయపడ్డారు. కుక్క యజమాని వినోద్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం