ఉన్నావ్ కేసు: జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పు... కంటతడి పెట్టిన సెంగార్

By Siva KodatiFirst Published Dec 20, 2019, 6:37 PM IST
Highlights

కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీలోని తీస్‌హజారీ కోర్టు శుక్రవారం జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తి తీర్పు వెలువరించే సమయంలో సెంగార్ తన కుమార్తె, సోదరితో కలిసి కన్నీళ్లు పెట్టుకున్నాడు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు యూపీ బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీలోని తీస్‌హజారీ కోర్టు శుక్రవారం జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే.

న్యాయమూర్తి తీర్పు వెలువరించే సమయంలో సెంగార్ తన కుమార్తె, సోదరితో కలిసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాధ్యతగల ప్రజా ప్రతినిధిగా ఉండాల్సిన సెంగార్.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని కోర్టు పేర్కొంది.

Also Read: ఉన్నావ్ రేప్‌ కేసు:బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు

అత్యాచార బాధితురాలిని భయపెట్టే విధంగా సెంగార్ వ్యవహరించారని, ఇందుకు గాను ఆయన జీవితాంతం జైలులో ఉండాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. నెలరోజుల్లోగా బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని సెంగార్‌ను ఆదేశించింది.

Also Read:నిర్భయ మిత్రుడు ఏం చేస్తున్నాడు.. ఎక్కడున్నాడు

అయితే కోర్టు తీర్పుపై బాధితురాలి కుటుంబసభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కుల్‌దీప్‌కు మరణశిక్ష విధించి ఉంటే తమకు న్యాయం చేసినట్లని, అయితే తమ కుటుంబానికి ఎలాంటి ముప్పులేదన్న సంతృప్తి మాత్రం మిగిలిందని బాధితురాలి సోదరి పేర్కొంది. సెంగార్ జైలులో ఉన్నంతకాలం తాము బిక్కుబిక్కుమంటూనే ఉన్నామని... ఒకవేళ అతను బయటకొస్తే తమ కుటుంబాన్ని చంపేస్తాడని ఆమె అభిప్రాయపడ్డారు. 

click me!