2008లో జరిగిన జైపూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురు దోషులకు రాజస్థాన్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించగా.. ఒకరిని దోషిగా తేల్చింది.
2008లో జరిగిన జైపూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురు దోషులకు రాజస్థాన్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించగా.. ఒకరిని దోషిగా తేల్చింది. 2008 మే నెలలో జైపూర్ పాత నగరంలోని హనుమాన్ ఆలయ సమీపంలో నిమిషాల వ్యవధిలో 9 వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి.
ఈ ఘటనలో 80 మంది మరణించగా, 170 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మరో నాలుగు బాంబులను కనుగొని నిర్వీర్యం చేశారు. ఈ ప్రాంతంలోని హనుమాన్ భక్తులు, విదేశీ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు.
undefined
Also Read:జైపూర్ బాంబు పేలుళ్లు: నలుగురు దోషులు, ఒకరికి విముక్తి
ఈ ఘటన వెనుక బంగ్లాదేశ్‌కు చెందిన హర్కతుల్ జిహాదీ ఇస్లామీ(హుజి) అనే ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. మొహమ్మద్ షాబాజ్ హుస్సేన్, మొహమ్మద్ సైఫ్ అకా కారియోన్, మొహమ్మద్ సర్వార్ అజ్మి, మొహమ్మద్ సైఫ్ అలియాస్ సైఫుర్ రహమాన్ అన్సారీ, మొహమ్మద్ సల్మాన్‌లను నిందితులుగా అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం విచారణ ప్రారంభించిన రాజస్ధాన్ ఏటీసీ విభాగం ఐదుగురిని అరెస్ట్ చేసి ఛార్జిషీట్ దాఖలు చేసింది.. పదేళ్లపాటు సాగిన విచారణ తర్వాత ప్రత్యేక కోర్టు బుధవారం నలుగురిని దోషులుగా, ఒకరిని నిర్దోషిగా ప్రకటించి, శుక్రవారం తుది తీర్పును వెలువరించింది.
Also Read:ఉన్నావ్ రేప్ కేసు:బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు
ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు ప్రస్తుతం తీహార్ జైలులోనే శిక్షను అనుభవిస్తున్నారు. నిందితులంతా యూపీ వాసులే కావడం గమనార్హం. మొహ్మద్ అతిన్ అనే వ్యక్తి బాంబు పేలుళ్ల వెనుక మాస్టర్ మైండ్‌గా తెలుస్తోంది. అయితపే అతనిని బాట్లా హౌజ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులు హతమార్చారు.