రాష్ట్రపతి ఎన్నికలు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో అమిత్ షా, జేపీ నడ్డా భేటీ

Published : Jun 21, 2022, 01:24 PM ISTUpdated : Jun 23, 2022, 05:56 PM IST
 రాష్ట్రపతి ఎన్నికలు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో అమిత్ షా, జేపీ నడ్డా భేటీ

సారాంశం

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం నాడు భేటీ అయ్యారు.  రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. 

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో  కేంద్ర హోంశాఖ మంత్రి Amit Shah , రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు JP Nadda మంగళవారం నాడు భేటీ అయ్యారు. ఉపరాష్ట్రపతి Venkaiah Naidu తో  ఆయన నివాసంలో అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఇవాళ సాయంత్రం BJP  పార్లమెంటరీ పార్టీ సమావేశం న్యూఢిల్లీలో జరగనుంది. ప్రధాని Narendra Modi కర్ణాటక రాష్ట్ర పర్యటనను ముగించుకొని వచ్చిన  బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగే అవకాశం ఉంది. 

Hyderabad లో జరిగిన Yoga Day లో పాల్గొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు.రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఇవాళ ఉదయం సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత  జేపీ నడ్డా, అమిత్ , రాజ్షా నాథ్లు సింగ్ లు Vice Preident తో భేటీ అయ్యారు. వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలోకి దింపుతారా, లేదా ఉపరాష్ట్రపతిగా ఆయనకు మరోసారి చాన్స్ ఇస్తారా అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో  కేంద్ర మంత్రులు, జేపీ నడ్డాలు సుమారు 50 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక కోసం  కేంద్ర మంత్రులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులతో పాటు మరో 14 మంది కీలక నేతలతో బీజేపీ కమిటీని ఏర్పాటు చేసింది.  ఈ కమిటీతో జేపీ నడ్డా ఆదివారం నాడు భేటీ అయ్యారు. 

రాష్ట్రపతి ఎన్నికల విషయమై బీజేపీ నేతలు విపక్ష పార్టీల నేతలకు కూడా ఫోన్లు చేసి మద్దతును కోరారు. కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గత వారంలో పోన్ చేశారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రాజ్‌నాథ్ సింగ్ ముందు ఎన్డీయే అభ్యర్థి పేరు చెప్పాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ తరఫున ఎవరు బరిలోకి దిగుతున్నట్టు విపక్ష నేతలు రాజ్‌నాథ్‌ను ప్రశ్నించినట్టు సమాచారం.

విపక్ష పార్టీలు అభ్యర్ధిని ఇంకా నిర్ణయించలేదు. అయితే మాజీ బీజేపీ నేత ఇటీవల టీఎంసీలో చేరిన యశ్వంత్ సిన్హాను విపక్షాలు రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దింపే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. టీఎంసీకి ఇవాళ యశ్వంత్ సిన్హా రాజీనామా చేయడం కూడా ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా ఉంది.  

రాష్ట్రపతి ఎన్నిక నేప‌థ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీలో గ‌త వారం మొద‌టి సారిగా విపక్ష నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. దేశ ప్రజాస్వామ్య ధర్మాన్ని నిలబెట్టే సాధారణ అభ్యర్థిని ప్రతిపక్ష అభ్యర్థిగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ, శ‌ర‌ద్ ప‌వార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పేర్లు అందులో ఉన్నాయి. అయితే ఈ ముగ్గురు తాము పోటీకి సిద్ధంగా లేమ‌ని ప్ర‌క‌టించారు. కాగా ఈరోజు జ‌రిగే స‌మావేశంలో విప‌క్షాల నుంచి రాష్ట్రప‌తి అభ్య‌ర్థి బ‌రిలో ఎవ‌రు నిలుస్తార‌నే విష‌యంపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. జూలై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ప్ర‌స్తుత‌ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?