తృణముల్ కాంగ్రెస్ పార్టీకి యశ్వంత్ సిన్హా రాజీనామా.. రాష్ట్రపతి ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఛాన్స్ ?

Published : Jun 21, 2022, 01:03 PM ISTUpdated : Jun 23, 2022, 05:57 PM IST
తృణముల్ కాంగ్రెస్ పార్టీకి యశ్వంత్ సిన్హా రాజీనామా.. రాష్ట్రపతి ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఛాన్స్ ?

సారాంశం

టీఎంసీ ఉపాధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. తన నిర్ణయాన్ని ఆమోదించాలని మమతా బెనర్జీని కోరారు. ఇన్ని రోజులు తనకు మంచి ప్రాధాన్యత ఇచ్చినందకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.

కేంద్ర మంత్రి, TMC ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా త‌న పార్టీకి మంగ‌ళ‌వారం రాజీనామా చేశారు. ప్ర‌తిప‌క్షాలు రాష్ట్రపతి అభ్యర్థిని ప్ర‌క‌టించేందుకు ఏర్పాటు చేసుకున్న స‌మావేశానికి కొన్ని గంట‌ల ముందు ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ఆయ‌న రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షాల అభ్య‌ర్థిగా ఉండ‌నున్నార‌ని, అందుకే రాజీనామా చేశార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. 

లంచం తీసుకుంటూ.. జాయింట్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఈశ్వర్ రెడ్డి అరెస్ట్...

య‌శ్వంత్ సిన్హా త‌న రాజీనామాను ప్ర‌క‌టిస్తూ.. “ TMCలో మమతా జీ నాకు అందించిన గౌరవం, ప్రతిష్టకు నేను ఆమెకు కృత‌జ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు ఒక పెద్ద జాతీయ ప్రయోజనం కోసం నేను పార్టీ నుండి తప్పుకుని  ప్రతిపక్షాల ఐక్యత కోసం పని చేయాల్సిన సమయం వచ్చింది. నా నిర్ణ‌యాన్ని ఆమె ఆమోదిస్తుంద‌ని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ’’ అని ఆయ‌న ట్వీట్ చేశారు. 

రాష్ట్రపతి ఎన్నికలపై ఈరోజు జరగనున్న కీలక సమావేశానికి ముందు వామపక్షాలు, కాంగ్రెస్‌కు చెందిన ప్రతిపక్ష నాయకులు సోమవారం రాత్రి ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిగా సిన్హా పేరును పవార్ ప్రతిపాదించిన్న‌ట్టు తెలుస్తోంది. అయితే వామపక్ష నేతలు ఎవరి పేర్లనూ సూచించలేదు. రాబోయే రాష్ట్రపతి ఎన్నికలకు ఏకాభిప్రాయ అభ్యర్థిపై చర్చించేందుకు పవార్ నేడు ప్రధాన ప్రతిపక్ష పార్టీల సమావేశం నిర్వహించనున్నారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ప్రతిపక్ష సమావేశానికి పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది.

పెళ్లైన నెలకే భర్తను ఇంట్లోంచి గెంటేసి.. ప్రియుడితో మకాం.. అడిగితే రౌడీలతో బెదిరించి...

రాష్ట్రపతి ఎన్నిక నేప‌థ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీలో గ‌త వారం మొద‌టి సారిగా విపక్ష నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. దేశ ప్రజాస్వామ్య ధర్మాన్ని నిలబెట్టే సాధారణ అభ్యర్థిని ప్రతిపక్ష అభ్యర్థిగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. కాగా అనంర‌తం ప్రతిపక్షం రాష్ట్రప‌తి అభ్య‌ర్థులుగా ముగ్గురు పేర్ల‌ను ప్ర‌తిపాదించింది. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ, శ‌ర‌ద్ ప‌వార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పేర్లు అందులో ఉన్నాయి. అయితే ఈ ముగ్గురు తాము పోటీకి సిద్ధంగా లేమ‌ని ప్ర‌క‌టించారు. కాగా ఈరోజు జ‌రిగే స‌మావేశంలో విప‌క్షాల త‌రుఫు నుంచి రాష్ట్రప‌తి అభ్య‌ర్థి బ‌రిలో ఎవ‌రు నిలుస్తార‌నే విష‌యంపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. జూలై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ప్ర‌స్తుత‌ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది.

PREV
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?