బ్యాట్‌పై విరాట్ కోహ్లీ సంతకం.. ఆస్ట్రేలియాకు బహూకరించిన కేంద్ర మంత్రి

Published : Feb 12, 2022, 06:43 PM IST
బ్యాట్‌పై విరాట్ కోహ్లీ సంతకం.. ఆస్ట్రేలియాకు బహూకరించిన కేంద్ర మంత్రి

సారాంశం

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతకం పెట్టిన బ్యాట్‌ను కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. ఆస్ట్రేలియా మంత్రి మ్యారిస్ పైన్‌కు బహూకరించారు. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్.. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ బ్యాట్‌ను కేంద్ర మంత్రి.. పైన్‌కు ఇచ్చారు. ఈ చిత్రాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు.  

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ‌(Virat Kohli)కు అంతర్జాతీయ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. క్రికెట్(Cricket) అభిమానులకైతే కోహ్లీ మరెంతో ఇష్టం. ఆయన ఖ్యాతి కేవలం క్రికెట్ ప్రపంచానికే పరిమితం కావడం లేదు. తాజాగా, కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్‌ ఆధారంగా క్రికెట్ దౌత్యాన్ని నెరిపారు. క్వాడ్ సమావేశానికి ఆస్ట్రేలియా వెళ్లిన కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ ఆ దేశ మంత్రికి విరాట్ కోహ్లీ సంతకం పెట్టిన బ్యాట్‌ను బహుమానంగా ఇచ్చారు. ఆస్ట్రేలియాలో అతిపెద్ద గ్రౌండ్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో కేంద్ర మంత్రి ఎస్ జైశకంర్(S Jaishanker) ఈ బ్యాట్‌ను ఆస్ట్రేలియా(Australia) విదేశీ వ్యవహారాల మంత్రి మ్యారిస్ పైన్‌కు అందించారు. ఈ విషయాన్ని డాక్టర్ ఎస్ జైశకంర్ ట్విట్టర్ హ్యాండిల్ వెల్లడించింది.

క్వాడ్ సమావేశం కోసం కేంద్ర మంత్రి జైశకంర్ ఆస్ట్రేలియాకు వెళ్లారు. అక్కడ ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా మంత్రులతో ఆయన చర్చలు చేపట్టారు. క్వాడ్ సమావేశాలు ఆశాజనకంగా ముగిశాయని ఆయన పేర్కొన్నారు. క్వాడ్ కూటమి పాజిటివ్ సందేశాలను కలిగి ఉన్నదని, అదే విధానాన్ని అవలంభిస్తుందనే విషయంపై ఎవరికైనా సందేహాలు ఉంటే.. వారు నిన్న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మాతో ఉండాల్సింది అని నిన్న ట్వీట్ చేశారు. క్రికెట్ గురించి తమ మధ్య ఈ గ్రౌండ్‌లో చర్చ జరిగిందని వివరించారు. క్వాడ్ అందించే సానుకూల సందేశాన్ని, విధానాన్ని ఎవరూ సందేహించరాదని సూచించారు. క్వాడ్ సమావేశం ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి జైశంకర్.. ఆస్ట్రేలియా మంత్రి పైన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.

ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యూఎస్‌ల కూటమి ఇటీవలి సంవత్సరాల్లోనే క్వాడ్ కూటమిగా ఏర్పడింది. ఆసియాలో అతిపెద్ద కూటమిగా ఇప్పటి వరకు ఏఎస్ఈఏఎన్ ఉండేది. ఈ కూటమిలోనూ యూఎస్, జపాన్, చైనా, ఇండియాలు, ఆస్ట్రేలియాలు ఉండేవి. ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అసోసియేషన్‌లో పది దేశాలు ఉండేవి. కానీ, దీనికి అతీతంగా చైనాను మినహాయించి ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాలు జట్టుకట్టడం డ్రాగన్‌కు నచ్చడం లేదు.

అయితే, దక్షిణాసియాలో సముద్ర జలాలపై చైనా పెత్తనం చెలాయిస్తున్నదని జపాన్ సహా బ్రూనై, తైవాన్, ఫిలిప్పీన్స్, మలేసియా, వియత్నాం దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. తమకు ఆ హక్కు ఉన్నదని చైనా వాదిస్తుండగా.. అందుకు విరుద్ధంగా ఈ దేశాలు డిమాండ్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి అమెరికా వేస్తున్న పాచికగా చైనా ఈ కూటమిని చూస్తున్నది. గతంలోనూ ఆసియాలో ఆధిపత్యానికి అమెరికా దేశం ఆస్ట్రేలియాను వినియోగించుకుంది. ఈ సారి కూడా అదే నిర్ణయాన్ని ఫాలో అవుతున్నదని ఆ దేశం భావిస్తున్నది. నిజానికి చైనాను కౌంటర్ చేయడానికి అమెరికా ఆశలు భారత్‌పైనే ఎక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు భారత్ కంటే.. కూడా ఆస్ట్రేలియానే అమెరికా ఎక్కువగా నమ్ముకున్నట్టు కొందరు నిపుణులు చెబుతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !