karnataka hijab row: బెంగాల్‌కు పాకిన హిజాబ్ సెగ.. రోడ్డెక్కిన అలియా వర్సిటీ విద్యార్ధులు

Siva Kodati |  
Published : Feb 12, 2022, 06:42 PM IST
karnataka hijab row: బెంగాల్‌కు పాకిన హిజాబ్ సెగ.. రోడ్డెక్కిన అలియా వర్సిటీ విద్యార్ధులు

సారాంశం

కర్ణాటకను (karnataka) కుదిపేస్తోన్న హిజాబ్ వివాదం తాజాగా పశ్చిమ బెంగాల్‌కు (west bengal) పాకింది. అలియా యూనివర్సిటీకి చెందిన విద్యార్ధులు హిజాబ్‌కు అనుకూలంగా శనివారం రోడ్డెక్కారు. ఈ సందర్భంగా హిజాబ్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. 

హిజాబ్ వివాదంతో (hijab row) కర్నాటక అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. హిజాబ్ ధరించిన బాలికలను వేరుగా కూర్చోబెట్టడం, వారిని కాలేజ్‌ల్లోకి అనుమతించకపోవడంతో పరిస్థితులు చేదాటాయి. దీంతో ఇరువ‌ర్గాల మ‌ధ్య‌  ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. దీంతో విద్యాసంస్థలు మ‌రో మూడురోజులపాటు సెలవులు ప్రకటించారు. ఇది ఇలాగే కొనసాగితే .. దేశంలో హిందూ, ముస్లిం ఘర్షణలు చెలరేగడం ఖాయమని ప‌లువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కర్ణాటకను (karnataka) కుదిపేస్తోన్న హిజాబ్ వివాదం తాజాగా పశ్చిమ బెంగాల్‌కు (west bengal) పాకింది. అలియా యూనివర్సిటీకి చెందిన విద్యార్ధులు హిజాబ్‌కు అనుకూలంగా శనివారం రోడ్డెక్కారు. ఈ సందర్భంగా హిజాబ్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. 

మరోవైపు హిజాబ్ వివాదాన్ని మ‌రి పెద్ద‌దిగా చూడోద్దని సుప్రీంకోర్టు (supreme court) హెచ్చ‌రించింది. ఈ వివాదంపై క‌ర్ణాట‌క హైకోర్టును (karnataka high court) హెచ్చ‌రించింది. భావోద్వేగాలతో పనిలేదని..రాజ్యాంగంతోనే పనేన‌ని…రాజ్యాంగం ఎలా నిర్ణయం తీసుకోవాలో..అలాగే తీసుకుంటామని స్పష్టం చేసింది.  తాజా వివాదంపై సమాజ్‌వాదీ పార్టీ (samajwadi party) నేత రుబీనా ఖానం చాలా ఘాటుగా స్పందించారు. హిజాబ్‌ను తాకేందుకు ప్రయత్నించే చేతులను నరికివేస్తామని హెచ్చ‌రించారు. 
  
కర్ణాటక హిజాబ్ వివాదంపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. ఈ త‌రుణంలో  హిజాబ్‌ను తాకడానికి ప్రయత్నించే వారి చేతులు నరికివేస్తామని సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు రుబీనా ఖానం అన్నారు. శనివారం ఆమె  ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్శిటీకి చెందిన మహిళా విద్యార్థినులు నిర్వ‌హించిన‌ హిజాబ్ నిషేధానికి వ్యతిరేకంగా నిరసన కార్య‌క్ర‌మంలో ఆమె పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ..  మీరు భారతదేశంలోని కుమార్తెలు, సోదరీమణుల గౌరవంతో ఆడుకోవాలని ప్రయత్నిస్తున్నార‌నీ, అలాంటి  దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే.. తాము ఝాన్సీ రాణి,  రజియా సుల్తానాలా మారి.. హిజాబ్ తాకిన వారి చేతులు నరికేస్తామ‌ని హెచ్చ‌రించారు. 

భారతదేశం భిన్నత్వం గల దేశమని, నుదుటిపై తిలకం పెట్టుకున్నారా?  హిజాబ్ ధరించారా? అనే పట్టింపు లేదని పేర్కొంది.  'ఘున్‌ఘట్, హిజాబ్ .. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో అంతర్భాగమ‌ని అన్నారు. ఈ అంశాలను రాజకీయం చేస్తూ.. వివాదం సృష్టించడం దారుణమని  అన్నారు. "ప్రభుత్వాన్ని ఏ పార్టీ అయినా నడపవచ్చు, కానీ మహిళలను బలహీనంగా పరిగణించడాన్ని ఎవరూ ఉపేక్షించ‌ర‌ని  రుబీనా ఖానం అన్నారు. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !