Uttarakhand Elections 2022: రాహుల్ గాంధీ ఓ అభిన‌వ‌ జిన్నా: అసోం సీఎం

Published : Feb 12, 2022, 06:39 PM IST
Uttarakhand Elections 2022: రాహుల్ గాంధీ ఓ అభిన‌వ‌ జిన్నా:  అసోం సీఎం

సారాంశం

కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీను  అభిన‌వ‌ జిన్నాఅని అభివర్ణిస్తూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ విమ‌ర్శించారు. రాహుల్ గాంధీ భాష, వాక్చాతుర్యం మిస్టర్ జిన్నా లాగానే ఉందని శర్మ అన్నారు. "ఒక విధంగా రాహుల్ గాంధీ..  మాడ్ర‌న్ జిన్నా" అని ఆయన అన్నారు.   

కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీను  అభిన‌వ‌ జిన్నాఅని అభివర్ణిస్తూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ విమ‌ర్శించారు. రాహుల్ గాంధీ భాష, వాక్చాతుర్యం మిస్టర్ జిన్నా లాగానే ఉందని శర్మ అన్నారు. "ఒక విధంగా రాహుల్ గాంధీ..  మాడ్ర‌న్ జిన్నా" అని ఆయన అన్నారు. 

నిన్న‌.. 2016లో పీవోకేలో ఆర్మీ సర్జికల్‌ స్ట్రైక్స్‌, 2019లో బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన మెరుపు దాడులకు ఆధారాలు కావాలని రాహుల్ గాంధీ ప్ర‌శ్నించడంపై  హిమంత బిస్వా శర్మ విరుచుక‌ప‌డ్డారు. ‘నువ్వు మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ కుమారుడివేనా?’ అని బీజేపీ ఎప్పుడైనా డిమాండ్‌ చేసిందా అని అన్నారు. ఆర్మీ నుంచి సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఆధారాలు డిమాండ్‌ చేసే హక్కు నీకు ఉన్నదా అని రాహుల్‌ను నిలదీశారు.  దీంతో హిమంత బిస్వా శర్మ వ్యాఖ్య‌లను గౌహతిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీవ్రంగా ఖండించారు. నిరసన ప్రదర్శన నిర్వహించి బిస్వా శర్మ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈరోజు హిమంత బిస్వా శర్మ తన వ్యాఖ్యను వివరించడానికి ప్రయత్నించారు. అస్సాంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస త‌న క్రూరమైన వ్యాఖ్య ద్వారా రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చారని నిందించారు. “ భారత‌ ఆర్మీ జవాన్లు శత్రు భూభాగంలో ఏదైనా చర్యకు వెళ్లడానికి ఒక నెల ముందు ప్లాన్ చేస్తారు. ఇవి వ్యూహాత్మక చర్యలు, ఆపరేషన్ తర్వాత పత్రికా ప్రకటన విడుదల చేసిన తర్వాత.. దాని గురించి మాకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైనా రుజువు అడుగుతూ ఉంటే.. ఆర్మీ జవాన్ అనుభవించే బాధ గురించి ఆలోచించండి, ”అని అతను చెప్పాడు.

 రాహుల్ గాంధీ ఇటీవలి ప్రసంగాలను ప్రస్తావించారు. పార్లమెంటులో బిజెపిని విమ‌ర్శించేట‌ప్పుడూ. రాహుల్ గాంధీ శ‌రీరంలోకి జిన్నా ప్రవేశించినట్టు కనిపిస్తోందని శర్మ అన్నారు. రాహుల్ గాంధీకి  ఇండియా అంటే గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ దాకా మాత్రమే అనిపిస్తోంది. గత పది రోజులుగా ఆయన చెప్పేది గమనిస్తున్నాను. ఎప్పుడూ కూడా ఆయ‌న‌ ఇండియా అంటే రాష్ట్రాల యూనియన్ అని అన‌లేద‌నీ, ఇండియా అంటే ఆయ‌న దృష్టిలో గుజరాత్ నుంచి బెంగాల్ మాత్ర‌మేన‌ని భావిస్తాడ‌నీ. కాబట్టి, రాహుల్ గాంధీలోకి జిన్నా దెయ్యం ప్రవేశించిందని చెబుతున్నానని అన్నారు.  ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి 14న ఒకే దశలో ఓటింగ్ జరుగుతుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bhajan Clubbing : మోదీ మెచ్చిన భజన్ క్లబ్బింగ్.. ఇందులో అంత కిక్ ఏముంది? అసలు ఏంటిది?
Attari-Wagah Border Republic Day:భారత్- పాక్ సరిహద్దుల్లో నరాలు తెగిపడే ఉత్కంఠ | Asianet News Telugu