ట్విట్టర్ ఇంటర్మీడియరీ హోదా.. లాస్ట్ ఛాన్స్ వదిలేసింది, చట్టం తన పని తాను చేసింది: రవిశంకర్ ప్రసాద్

By Siva KodatiFirst Published Jun 17, 2021, 4:20 PM IST
Highlights

ట్విట్టర్‌కు ఇంటర్మీడియరీ హోదా తొలగించింది తాను కాదన్నారు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చట్టమే ట్విట్టర్‌కు ఇంటర్మీడియరీ హోదా తొలగించిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

ట్విట్టర్‌కు ఇంటర్మీడియరీ హోదా తొలగించింది తాను కాదన్నారు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చట్టమే ట్విట్టర్‌కు ఇంటర్మీడియరీ హోదా తొలగించిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ట్విట్టర్ తప్ప మిగతా వాళ్లంతా నిబంధనలు పాటిస్తున్నారని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. మే 26తో కేంద్రం ఇచ్చిన మూడు నెలల గడువు ముగిసిందని ఆయన పేర్కొన్నారు. ట్విట్టర్‌కు మరో చివరి అవకాశం ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. 

కాగా, కేంద్ర ప్రభుత్వం  అమల్లోకి తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్ ను పాటించకపోవడంపై ట్విట్టర్ ఇండియాలో మధ్యవర్తి హోదాను కోల్పోయిందని నిన్న ప్రభుత్వవర్గాలు తెలిపాయి.కొత్త ఐటీ నిబంధనలను పాటించనిక్షణంలో ట్విట్టర్ ఇండియాలో మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయిందని అధికారవర్గాలు తెలిపాయి.  ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించిన విషయానికి వస్తే ట్విట్టర్ ఆ కంటెంట్ కు బాధ్యత వహిస్తోందని అధికారవర్గాలు తెలిపాయి.  ట్విట్టర్ కమ్యూనికేషన్ అస్పష్టంగా ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:ట్విట్టర్ ఇంటర్మీడియరీ హోదాను కోల్పోయిందంటున్న కేంద్రం, సాధ్యమా..?

ఇదిలా ఉండగా మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయినట్టు ప్రకటించే అధికారం ప్రభుత్వానికి లేదని, ఇందుకు సంబంధించి ఐటి రూల్స్ లో ఏక్కడా పేర్కొనలేదని ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ తెలిపింది. ట్విట్టర్ ద్వారా భారత ఐటి రూల్స్ ను ప్రస్తావిస్తూ ట్విట్టర్ ఇంటర్మీడియరీ హోదాను కోల్పోయిందా, లేదా అని కోర్టు నిర్ణయిస్తుంది తప్ప, ఆ అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పింది. ట్విట్టర్ ఇంటర్మీడియరీ హోదాను కోల్పోయిందని చెబుతూ ప్రభుత్వం ఇప్పటివరకు జీవోనుగానీ, సర్క్యూలర్ ని గానీ విడుదల చేయలేదని పేర్కొంది. 

click me!