కరోనా: డీఆర్‌డీవో చొరవ.. పీఎం కేర్స్ నిధులతో దేశవ్యాప్తంగా 850 ఆక్సిజన్ ప్లాంట్లు

By Siva KodatiFirst Published Jun 17, 2021, 4:08 PM IST
Highlights

కరోనా సెకండ్ వేవ్ వల్ల దేశంలో ఎన్నడూ లేని విధంగా మెడికల్ ఆక్సిజన్‌కు తీవ్రమైన కొరత వచ్చింది. దీంతో కేంద్రం వివిధ దేశాల నుంచి ఆక్సిజన్‌ను తెప్పించింది. ఇదే సమయంలో దేశంలోని కార్పోరేట్ దిగ్గజాలు, ప్రవాస భారతీయులు సైతం ఆక్సిజన్‌ను సమకూర్చారు. 

కరోనా సెకండ్ వేవ్ వల్ల దేశంలో ఎన్నడూ లేని విధంగా మెడికల్ ఆక్సిజన్‌కు తీవ్రమైన కొరత వచ్చింది. దీంతో కేంద్రం వివిధ దేశాల నుంచి ఆక్సిజన్‌ను తెప్పించింది. ఇదే సమయంలో దేశంలోని కార్పోరేట్ దిగ్గజాలు, ప్రవాస భారతీయులు సైతం ఆక్సిజన్‌ను సమకూర్చారు. అలాగే ఆసుపత్రుల వద్ద యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ ప్లాంట్‌లను ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిస్ధితులను అధిగమించేందుకు పీఎం కేర్స్ నిధులతో దేశవ్యాప్తంగా 850 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్‌డీవో వెల్లడించింది.

Also Read:2-డీజీ డ్రగ్‌: భారీగా డోసుల తయారీ, పంపిణీ కోసం... డీఆర్‌డీవో కీలక నిర్ణయం

దీనికి అదనంగా రానున్న రోజుల్లో ‘‘ఫ్లయింగ్ హాస్పిటల్స్’’ ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. సెకండ్ వేవ్ సమయంలో పలు నగరాల్లో తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేశామని వీటిని ఫ్లయింగ్ హాస్పిటల్స్‌గా పిలుస్తున్నామన్నారు డీఆర్‌డీవో ఛైర్మన్ సతీశ్ రెడ్డి. ఇందుకోసం పలువురి సహకారం కూడా తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇవి కాకుండా రక్షణ శాఖకు అవసరమైన అత్యంత ఆధునిక సాంకేతికతను అందించడంతో పాటు సామాన్యుల కోసం తక్కువ ధరలో అధిక నాణ్యత కలిగిన సాంకేతికతపైనా దృష్టి పెట్టినట్లు సతీశ్ రెడ్డి చెప్పారు. 

click me!