డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీలపై వాహనదారులకు కేంద్రం శుభవార్త.. కీలక ప్రకటన!

By Siva KodatiFirst Published Jun 17, 2021, 3:31 PM IST
Highlights

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్‌సీ) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జూన్ 30 వరకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ వంటి పలు వాహన సంబందిత డాక్యుమెంట్ల గడువును ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్‌సీ) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జూన్ 30 వరకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ వంటి పలు వాహన సంబందిత డాక్యుమెంట్ల గడువును ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. దీనికి సంబందించి కేంద్ర రోడ్డు & రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ పరిస్ధితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 

Also Read:ఇప్పుడు కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందడం/ రేన్యువల్ చాలా సులభం.. ఎలా అంటే ?

గతేడాది ఫిబ్రవరి 1న ముగిసిన అన్నీ వాహన పత్రాల గడువును సెప్టెంబర్ 30, 2021 నాటికి పొడిగిస్తున్నట్లు తెలిపింది. దీని వల్ల సామాజిక దూరాన్ని పాటిస్తూ రవాణా సంబంధిత సేవలను పొందవచ్చు అని వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు, రవాణాదారులు అధికారులకు సహకరించాలని తెలిపింది. అలాగే, గతంలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు, డ్రైవింగ్ లైసెన్స్ జారీకి సంబంధించిన నిబంధనలలోనూ స్వల్పంగా సవరణలు చేసింది. ఇంతకు ముందు, అభ్యర్థులు లైసెన్స్ కోసం ఆర్టివో కార్యాలయలలో డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సి వచ్చేది. కొత్త నిబందనల ప్రకారం, ప్రభుత్వం గుర్తించిన, అర్హత కలిగిన కేంద్రాల్లో డ్రైవింగ్ టెస్ట్ పాస్ అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

click me!