కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కు కరోనా పాజిటివ్..

Published : Apr 16, 2021, 07:03 PM IST
కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కు కరోనా పాజిటివ్..

సారాంశం

కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కరోనా బారిన పడ్డారు. తనకు కోవిడ్ 19 పాజిటివ్ ఉన్నట్లు నిర్థారణ అయ్యిందంటూ ఆయన స్వయంగా ఇవాళ ట్విట్టర్లో వెల్లడించారు. గడిచిన రెండు, మూడు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

తాజాగా  కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కరోనా బారిన పడ్డారు. తనకు కోవిడ్ 19 పాజిటివ్ ఉన్నట్లు నిర్థారణ అయ్యిందంటూ ఆయన స్వయంగా ఇవాళ ట్విట్టర్లో వెల్లడించారు. గడిచిన రెండు, మూడు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

70యేళ్ల జవదేకర్ ప్రస్తుతం కేంద్ర సమాచార ప్రసారాలు, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ పరిశ్రమలు సహా పలు కీలక మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. 

కర్ణాటక సీఎం యడియూరప్పకు రెండోసారి కరోనా: ఆసుపత్రిలో చికిత్స...

నాకు కోవిడ్ 19 పాజిటివ్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. గత 2,3 రోజులుగా నన్ను కలిసిన వారంతా స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను.. అని జవదేకర్ ట్వీట్ చేశారు. 

కాగా తాజాగా కరోనా బారిన పడిన రాజకీయ ప్రముఖుల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప తదితరులు ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్