తీవ్రరూపు దాలుస్తున్న కరోనా : కరెన్సీ ముద్రణ నిలిపివేత

By Siva Kodati  |  First Published Apr 16, 2021, 5:44 PM IST

కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ ప్రభావం నెమ్మదిగా దేశ ఆర్ధిక వ్యవస్థపైనా పడుతోంది. కాగా, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘బ్రేక్ ది చైన్’ క్యాంపెయిన్‌‌కు స్పందిస్తూ నాసిక్‌లోని కరెన్సీ సెక్యూరిటీ ప్రెస్, ఇండియా సెక్యూరిటీ ప్రెస్ ఈ నెల 30 వరకు కరెన్సీ ముద్రణను నిలిపివేశాయి


కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ ప్రభావం నెమ్మదిగా దేశ ఆర్ధిక వ్యవస్థపైనా పడుతోంది. కాగా, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘బ్రేక్ ది చైన్’ క్యాంపెయిన్‌‌కు స్పందిస్తూ నాసిక్‌లోని కరెన్సీ సెక్యూరిటీ ప్రెస్, ఇండియా సెక్యూరిటీ ప్రెస్ ఈ నెల 30 వరకు కరెన్సీ ముద్రణను నిలిపివేశాయి.

రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి విలయ తాండవాన్ని అడ్డుకునేందుకు గాను ఉద్ధవ్ ప్రభుత్వం  ‘బ్రేక్ ది చైన్’ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. దీనిలో భాగంగానే ఈ నెల 30 వరకు కరెన్సీ ముద్రణను నిలిపేసింది.

Latest Videos

undefined

దీంతో నాసిక్‌లోని కరెన్సీ సెక్యూరిటీ ప్రెస్, ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌లలో నగదు ముద్రణ నిలిచిపోయింది. అయితే అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేందుకు అవసరమైన సిబ్బంది మాత్రమే ఈ ముద్రణాలయాల్లో విధులకు హాజరవుతారని వెల్లడించింది.

Also Read:ఇండియాలో కోరలు చాస్తున్న కరోనా: ఒక్క రోజులోనే రెండు లక్షలు దాటిన కేసులు

అగ్నిమాపక, నీటి సరఫరా, వైద్య సేవలు వంటి విభాగాలకు చెందినవారు హాజరవుతారని కరెన్సీ సెక్యూరిటీ ప్రెస్ తెలిపింది. అయితే మన దేశంలో చలామణీ అయ్యే కరెన్సీ నోట్లలో 40 శాతం నోట్లు నాసిక్‌లోని ముద్రణాలయాల్లోనే తయారవుతాయి. వీటిలో సుమారు 3 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 

ప్రతిరోజు కొన్ని వేల మంది చేతులు మారే కరెన్సీ నోట్లతో కరోనా వ్యాపిస్తుందా లేదా అనేది చాలామందిలో ఉన్న సందేహం. మార్కెట్‌లో ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా నోట్లను ఇచ్చిపుచ్చుకోవడం తప్పనిసరి.

ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పూర్తిగా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజల ఇంకా నోట్లనే వాడుతున్నారు. చిరు వ్యాపారులు, కూరగాయల కొనుగోలు సమయంలో తప్పకుండా నోట్లు వాడాలి. దీంతో ప్రజల్లో నోట్ల వినియోగంపై భయాందోళనలు నెలకొన్నాయి.

click me!