మాస్క్ పెట్టుకోమన్నందుకు పోలీసులపై వీరంగం.. వెంటాడి పట్టుకున్న ఖాకీలు

By Siva KodatiFirst Published Apr 16, 2021, 4:52 PM IST
Highlights

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. పాజిటివ్ లక్షణాలతో ప్రజలు ఆసుపత్రుల ముందు బారులు తీరుతున్నారు. దీంతో తమను తాము కాపాడుకోవడంతో పాటు పక్కవారికి ఆరోగ్యం దృష్ట్యా మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.

అయినప్పటికీ జనంలో మాత్రం మారడం లేదు. తాజాగా మాస్క్ ధరించేందుకు తిరస్కరించడంతో పాటు ట్రాఫిక్ పోలీసులను అసభ్య పదజాలంతో దూషించిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. ములుంద్ ప్రాంతంలో ఓ దుకాణం నిర్వహిస్తున్న జతిన్ ప్రేమ్‌జీ అనే వ్యక్తి ముంబై ట్రాఫిక్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులను దుర్భాషలాడినట్టు ఎఫ్ఐఆర్ నమోదైంది.

Also Read:బెంగళూరులో కరోనా విలయతాండవం.. శ్మశానాలన్నీ ఫుల్..

ఆర్ఆర్‌టీ రోడ్డులో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు... ‘నో పార్కింగ్ జోన్’ వద్ద వాహనాలు నిలిపిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. అక్కడే జతిన్ బైక్ కూడా ఉండడంతో... అతడికి పోలీసులు జరిమానా విధించారు. దీనిపై ఆగ్రహంతో ఊగిపోపయిన అతడు పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు వాగ్వాదానికి దిగాడు.

 అదే సమయంలో కనీసం మాస్కు ధరించేందుకు కూడా నిందితుడు తిరస్కరించాడు. ఈ వ్యవహారం మొత్తాన్ని పోలీసులు రికార్డు చేశారు. అయితే జితిన్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించడంతో.. అతడిని వెంటాడి పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!