కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పదవీ కాలం పొడిగింపు, ఎప్పటి వరకంటే..?

By Siva KodatiFirst Published Aug 19, 2022, 10:10 PM IST
Highlights

కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఏడాది పాటు అంటే 2023 ఆగస్ట్ 22 వరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా అజయ్ భల్లా కొనసాగుతారని భారత ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. 

కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఏడాది పాటు అంటే 2023 ఆగస్ట్ 22 వరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా అజయ్ భల్లా కొనసాగుతారని భారత ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. మరో మూడు రోజుల్లో ఆయన పదవీ కాలం ముగియనుండగా.. కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 1984 బ్యాచ్ ఐఏఎస్ కేడర్‌కు చెందిన అజయ్ భల్లా.. అసోం, మేఘాలయ కేడర్‌కు చెందిన వారు. 2019 ఆగస్ట్‌లో ఆయన కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 

ఇకపోతే.. కేంద్ర కేబినెట్ సెకట్రరీ రాజీవ్ గౌబ పదవీ కాలాన్ని కూడా కేంద్రం పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అజయ్ భల్లా పదవీకాలాన్ని కూడా కేంద్రం పొడిగించడం గమనార్హం. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
 

click me!