రాజస్ధాన్ సంక్షోభం: రంగంలోకి అమిత్ షా, ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయం

By Siva KodatiFirst Published Jul 19, 2020, 6:41 PM IST
Highlights

ప్రస్తుతం దేశం రాజకీయాలను కుదిపేస్తున్న రాజస్థాన్ సంక్షోభం రోజుకొక మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్వయంగా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 

ప్రస్తుతం దేశం రాజకీయాలను కుదిపేస్తున్న రాజస్థాన్ సంక్షోభం రోజుకొక మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్వయంగా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

ఆయనతో పాటు మరో ఇద్దరు నేతలపై రాజస్థాన్ ప్రభుత్వం ఇది వరకే కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్ధితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు.

Also Read:రాజస్థాన్‌ సంక్షోభంలో మరో ట్విస్ట్: ఫోన్ ట్యాపింగ్‌పై రిపోర్టు కోరిన కేంద్రం

కాంగ్రెస్ చేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించారు. దీనిపై తమకు పూర్తి నివేదికను సమర్పించాల్సిందిగా రాజస్థాన్ సీఎస్‌ను అమిత్ షా ఆదేశించారు. షా జోక్యంతో రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కింది.

మరోవైపు రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌తో పాటు మరో 18 మందికి పార్టీ అధిష్టానం పంపిన షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.

Also Read:రాజస్థాన్ సంక్షోభం: సచిన్ వర్గానికి ఊరట.. స్పీకర్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

దీంతో తీర్పు ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. సచిన్ వర్గానికి తీర్పు వ్యతిరేకంగా వచ్చిన పక్షంలో అశోక్ బలపరీక్షకు సిద్ధమవ్వాలి. దీనిని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి.. గవర్నర్‌తో సమావేశమయ్యారని తెలుస్తోంది. విశ్వాస పరీక్షకు తాము సిద్ధమనే సంకేతాలు ఇవ్వడానికే ఈ భేటీ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఏం జరగాలన్నా హైకోర్టు తీర్పుపైనే ఆధారపడి వుంది. 

click me!