కరోనా భయం: భర్త డెడ్‌బాడీని తోపుడు బండిపై తీసుకెళ్లిన భార్య

Published : Jul 19, 2020, 06:18 PM IST
కరోనా భయం: భర్త డెడ్‌బాడీని తోపుడు బండిపై తీసుకెళ్లిన భార్య

సారాంశం

కరోనా భయంతో డెడ్‌బాడీ తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తోపుడు బండిపై భర్త శవాన్ని స్మశానికి తీసుకెళ్లింది భార్య.  ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది. 

బెంగుళూరు: కరోనా భయంతో డెడ్‌బాడీ తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తోపుడు బండిపై భర్త శవాన్ని స్మశానికి తీసుకెళ్లింది భార్య.  ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది. 

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలో 55 ఏళ్ల సదాశివ్ హిరాతీ అనే వ్యక్తి ఈ నెల 15వ తేదీన మరణించాడు. డెడ్ బాడీకి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయనకు కరోనా నెగిటివ్ అని తేలింది. గుండె జబ్బుతో బాధపడుతున్న హిరాతీ మరణించాడు.

also read:కరోనా దెబ్బ: ఈ నెల 31 వరకు అరసవల్లి టెంపుల్ మూత

హిరాతీ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇంటి పక్కన ఉన్నవారిని పిలిచినా ఎవరూ కూడ స్పందించలేదు. బంధువులు, కుటుంబసభ్యులు కూడ కరోనా భయంతో ఎవరూ కూడ ముందుకురాలేదు.

శవాన్ని స్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు ఎవరూ సహయం రాలేదు. దీంతో డెడ్ బాడీని తోపుడు బండిపై పెట్టి కొడుకు సహాయంతో స్మశాన వాటికకు తీసుకెళ్లింది. తోపుడు బండి నెట్టేందుకు ఓ కూలీ కూడ వారికి సహాయంగా వచ్చాడు. నాలుగు కిలోమీటర్ల దూరంలోని స్మశాన వాటికకు తీసుకెళ్లారు. 

ఈ స్మశానవాటికలో హిరాతీ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?