PM Modi: కరెంట్ బిల్లు జీరో చేయడానికి కేంద్రం అడుగులు: ప్రధాని మోడీ

By Mahesh K  |  First Published Feb 5, 2024, 1:42 AM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అసోంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంట్ బిల్లు జీరో చేయడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని వివరించారు.
 


PM Modi: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రతి కుటుంబానికి కరెంట్ బిల్లు జీరో చేయడానికి అడుగులు వేస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అసోంలోని గువహతిలో సుమారు రూ. 11,599 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘గత పదేళ్లలో తమ ప్రభుత్వం దేశంలోని ప్రతి ఇంటికి కరెంట్ అందించే క్యాంపెయిన్ చేపట్టింది. ఇప్పుడు కరెంట్ బిల్లు జీరో చేసే పనిలో ఉన్నది. బడ్జెట్‌లో రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్‌న ప్రకటించాం. ఈ స్కీం కింద తొలుత ఒక కోటి కుటుంబాలు రూఫ్ టాప్ సోలార్ అమర్చుకోవడానికి సహాయం చేస్తాం’ అని ప్రధాని మోడీ తెలిపారు.

Latest Videos

undefined

‘ప్రతి పౌరుడి జీవితం కంఫర్టబుల్‌గా చేయడమే మా లక్ష్యం. ఈ లక్ష్యం బడ్జెట్‌లో స్పష్టంగా ఉన్నది. మౌలిక సదుపాయాలపై రూ.11 లక్షల కోట్లు ఖర్చు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం’ అని మోడీ వివరించారు.

Also Read: Jharkhand: హైదరాబాద్ నుంచి రాంచీకి జార్ఖండ్ ఎమ్మెల్యేలు.. బలప్రదర్శనలో మాజీ సీఎం హేమంత్!

‘అయోధ్యలో భారీ కార్యక్రమం తర్వాత నేను ఇప్పుడు తల్లి కామాఖ్య ద్వారానికి వచ్చాను. మా కామాఖ్య దివ్య పరియోజన ప్రాజెక్టుకు ఇక్కడ శంకుస్థాపన చేసే భాగ్యం నాకు దక్కింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశ విదేశాల నుంచి కూడా కామాఖ్య అమ్మను దర్శించుకోవడం సులువు అవుతుంది.... అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన తర్వాత 12 రోజుల్లో 24 లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చారు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే టూరిజంపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

click me!