Fake Marriage: సామూహిక వివాహాల్లో స్కామ్.. 200 మంది ఫేక్ పెళ్లి

By Mahesh K  |  First Published Feb 5, 2024, 1:18 AM IST

యూపీ ప్రభుత్వం నిర్వహించిన సామూహిక వివాహాల్లో స్కామ్ జరిగింది. ఈ స్కీం కింద ప్రయోజనాలకు ఆశపడి చాలా మంది పెళ్లి చేసుకున్నవారే దరఖాస్తు చేసుకుని మళ్లీ పెళ్లి చేసుకున్నారు. పలువురు వధువులు వరుడు లేకుండా తమకు తామే వరమాల వేసుకున్న వీడియోలు బయటకు వచ్చాయి.
 


Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సామూహిక వివాహాలు చేపట్టింది. జనవరి 25వ తేదీన నిర్వహించిన సామూహిక వివాహాల్లో ఓ స్కామ్ బయటపడింది. అందులో కొందరు ఫేక్ పెళ్లి చేసుకున్నారని తేలింది. సుమారు 200 మంది ఈ స్కామ్‌లో ఉన్నట్టు తెలిసింది. సామూహిక కార్యక్రమాలకు చెందిన ఓ వీడియో వైరల్ అవుతున్నది. అందులో పలువురు ‘వధువులు’ తమకు తాము వరమాల వేసుకుంటున్నారు. వారికి ‘వరుడు’ లేరు. వారే పూలమాల వేసుకుంటున్నారు.

అధికారుల ప్రకారం ఆ సామూహిక వివాహ కార్యక్రమంలో 568 జంటలు పెళ్లి చేసుకుననారు. కానీ, దర్యాప్తులో సంచలన విషయం వెల్లడైంది. సుమారు 200 జంటలు కేవలం పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుగా నటించడానికి వచ్చారని, వారికి రూ. 2,000 చొప్పున అందిస్తామనే హామీ అందినట్టు తేలింది. 

Latest Videos

undefined

ఈ సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొన్న 19 ఏళ్ల ఓ యువకుడు మాట్లాడుతూ.. సామూహిక కార్యక్రమానికి తాను హాజరైతే రూ. 2000 ఇస్తామని చెప్పారని, కానీ, తాను వెళ్లినా.. ఆ డబ్బులు ఇవ్వలేదని ఇండియా టుడే టీవీకి చెప్పాడు.

Also Read: Jharkhand: హైదరాబాద్ నుంచి రాంచీకి జార్ఖండ్ ఎమ్మెల్యేలు.. బలప్రదర్శనలో మాజీ సీఎం హేమంత్!

సీఎం మాస్ మ్యారేజ్ స్కీమ్‌లో 25వ తేదీన జరిగిన కార్యక్రమంలో అందరూ అర్హులు కాదని దర్యాప్తు కమిటీ తేల్చింది. ఈ స్కీమ్ కింద ప్రయోజనాలు పొందడానికి కొందరు అక్రమంగా నడుచుకున్నారని, వాస్తవాలను దాచి పెట్టారని ఈ కమిటీ రిపోర్ట్ వెల్లడించింది. అయితే, అధికారులు నిర్లక్ష్యంగా వారి దరఖాస్తులు స్వీకరించడంతో ఫ్రాడ్ జరిగిందని పేర్కొంది. చాలా మంది అప్పటికే పెళ్లి చేసుకున్నవారని తెలిపింది.

click me!