కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డులను ప్రకటించింది. 34 మందికి ఈ అవార్డులను ప్రకటించగా.. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు కళాకారులకు ఈ అవార్డును ప్రకటించింది.
PadmaAwards: కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డులను ప్రకటించింది. మొత్తం 34 మందికి ఈ అవార్డులను ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికి పద్మాలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ దక్కింది.
తెలంగాణ నుంచి ఇద్దరు కళాకారులకూ పద్మ శ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జనగామ జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ దక్కింది. నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి, బుర్రవీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్పకు ఈ అవార్డను కేంద్రం ప్రకటించింది.
2024 సంవత్సరానికి గాను పద్మ శ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తొలి మహిళా ఏనుగు మావటి ఉన్నారు. పర్బతి బారువాకు ఈ అవార్డును ప్రకటించింది. అలాగే.. ట్రైబల్ ఎన్విరాన్మెంటలిస్ట్ చామి ముర్ము, మిజోరంకు చెందిన సోషల్ వర్కర్ సంగతంకిమ ఉన్నారు.
ప్లాస్టిక్ సర్జన్ ప్రేమ్ ధనరాజ్, ఇంటర్నేషనల్ మల్లఖంబ్ కోచ్ ఉదయ్ విశ్వనాథ్ దేశ్‌పాండేలకూ పద్మ శ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరితోపాటు జాగేశ్వర్ యాదవ్(సోషల్ వర్కర్), సత్యనారాయన బెలెరి(వ్యవసాయం, ధాన్యాలు), దుఖు మాజి(సోషల్ వర్కర్), కే చెల్లమ్మల్ (సేంద్రియ వ్యవసాయం), హేమచంద్ (ఆయుష్, సాంప్రదాయ వైద్యం), యనుంగ్ జమోహ్ లెగో (వ్యవసాయం, వనమూలికలు)లకూ పద్మ శ్రీ అవార్డులను ప్రకటించింది.