ఎన్నికల వేళా కనీసం ప్రకటనలు ఇవ్వలేకపోతున్నాం.. కేంద్రానిది నేరపూరిత చర్య: కాంగ్రెస్ ఆవేదన

By Mahesh KFirst Published Mar 21, 2024, 4:42 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేసిందని ఆ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్రానికి నేరపూరిత చర్య అని వివరించింది. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలు మీడియా సమావేశం నిర్వహించింది.
 

కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేసిందని, ఎన్నికల వేళా తమను ఆర్థికంగా దెబ్బ తీయాలని చూస్తున్నదని ఆ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనాయకులు రాహుల్ గాంధీ సహా పలువురు మీడియా సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి తమ పార్టీపై నేరపూరిత చర్యకు పాల్పడుతున్నదని పార్టీ నాయకులు పేర్కొన్నారు. తమ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారని వివరించారు. లావాదేవీలు చేయలేని పరిస్థితి ఉన్నదని తెలిపారు. ఎన్నికల వేళా కనీసం ప్రకటనలు కూడా ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. తాము ఎక్కడికీ వెళ్లలేకపోతున్నామని, విమాన ప్రయాణాలే కాదు.. కనీసం రైలు టికెట్లు కూడా కొనడానికి తమ వద్ద డబ్బులు లేవని వివరించారు.

ఇది కేవలం తమ పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేయడమే కాదు.. భారత ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడమని కాంగ్రెస్ నాయకులు ఫైర్ అయింది. తమకు 20 శాతం ఓటర్ల మద్దతు తమకు ఉన్నదని, కానీ, తాము రెండు రూపాయలు కూడా చెల్లించలేకపోతున్నామని తెలిపింది. ఎన్నికల్లో పోటీలో తమ సామర్థ్యాన్ని చూపెట్టలేకపోతున్నామని వివరించింది. అంతేకాదు, ఈసీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని పేర్కొంది.

click me!