మాజీ ప్రధానులు పీ.వీ. నరసింహారావు, చరణ్ సింగ్ సహా స్వామినాథన్ లకు భారతరత్న

Published : Feb 09, 2024, 12:51 PM ISTUpdated : Feb 09, 2024, 01:16 PM IST
మాజీ ప్రధానులు  పీ.వీ. నరసింహారావు, చరణ్ సింగ్  సహా  స్వామినాథన్ లకు భారతరత్న

సారాంశం

ఒకే రోజున ముగ్గురికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాలను ప్రకటించింది.  ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. 


న్యూఢిల్లీ:  మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహరావుకు బారత రత్నను కేంద్రప్రభుత్వం ప్రకటించింది.


మాజీ ప్రధాన మంత్రి పీ.వీ. నరసింహారావును భారత రత్నతో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.మాజీ ప్రధాన మంత్రి పీ.వీ. నరసింహారావును భారత రత్నతో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.  విశిష్ట పండితుడు, రాజనీతిజ్ఞుడిగా నరసింహరావు భారత దేశానికి వివిధ హోదాల్లోసేవలందించిన విషయాన్ని మోడీ సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా అనేక ఏళ్ల పాటు పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా  పనిచేసిన విషయాన్ని మోడీ ప్రస్తావించారు.

 

1991 నుండి  1996 వరకు భారత దేశ ప్రధాన మంత్రిగా  పీ.వీ. నరసింహారావు పనిచేశారు. ఇటీవల మరణించిన  వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్,  మాజీ ప్రధాన మంత్రి చరణ్ సింగ్ కు కూడ  భారత రత్నను ప్రకటించిందికేంద్ర ప్రభుత్వం.ఒకే ఏడాది ఐదుగురికి  భారత రత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్