ఉత్తరాఖండ్ హల్ద్వానీలో శాంతి భద్రతల పునరుద్దరణ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
న్యూఢిల్లీ: వారు మమ్మల్ని సజీవ దహనం చేయడానికి ప్రయత్నించారు. ఓ మహిళా పోలీస్ అధికారి మీడియా ప్రతినిధులకు చెప్పారు.ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో జరిగిన హింసపై ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాళ్ల దాడి నుండి తప్పించుకొనేందుకు తామంతా ఒక ఇంట్లో దాక్కున్నట్టుగా ఆమె తెలిపారు. ఆ ఇంట్లోకి చొరబడిన దుండగులు తమపై దాడి చేసి, ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారని మహిళా పోలీస్ అధికారి మీడియాకు చెప్పారు.
అన్ని వైపులా నుండి రాళ్ల దాడి జరిగిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తమను రక్షించిన ఇంటిపై కూడ అల్లరిమూకలు దాడి చేసినట్టుగా ఆమె తెలిపారు.అయితే అదనపు బలగాలు వచ్చి తమను రక్షించినట్టుగా ఆమె తెలిపారు.
undefined
ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో హింస చెలరేగిన తర్వాత నాలుగు కంపెనీల పారా మిలటరీ బలగాలను మోహరించారు. అల్లర్ల నేపథ్యంలో కనిపిస్తే కాల్చివేత ఆర్డర్లను కూడ జారీ చేశారు. పాఠశాలలు, కాలేజీలు మూసివేశారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది.
హల్ద్వానీలో అల్లర్ల నేపథ్యంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ సహా ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హింసను ప్రేరేపించే వారిపై కఠిన చర్యలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
"We were hiding in a house to save ourselves from stone pelting, then aprx 15 people entered the house, assaulted us & then tried to set the house on fire with an intention to burn us aIive - The lady officer describes the horror story of ".. 😡😡 pic.twitter.com/YwcKzd4XBa
— Mr Sinha (@MrSinha_)హింస జరిగిన ప్రాంతంలో నాలుగు కంపెనీల పారా మిలటరీ బలగాలను పంపినట్టుగా ఉన్నతాధికారులు తెలిపారు. ఉధమ్ సింగ్ నగర్ నుండి ఫ్రావిన్షియల్ ఆర్మ్ డ్ కాన్‌స్టాబులరీ కి చెందిన మరో రెండు కంపెనీలు కూడ ఈ ప్రాంతానికి చేరినట్టుగా అధికారులు వివరించారు.
బంభూల్ పురాలో కర్ఫ్యూ విధించారు. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలను నైనిటాల్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది. ప్రశాంతతను పునరుద్దరణకు, హింస మరింత పెరగకుండా నిరోధించడానికి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.ప్రభుత్వ భూమిలో అక్రమంగా మదర్సా, మసీదులను అక్రమంగా నిర్మించారనే నెపంతో వాటిని కూల్చివేసే సమయంలో ఘర్షణ చోటు చేసుకుంది.
ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు ఆక్రమణకు గురౌతున్నాయని కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేతలు జరిగాయని సీనియర్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ ప్రహ్లాడ్ మీనా ధృవీకరించారు. శాంతిభద్రతలను పునరుద్దరించడానికి, హింసను గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.