కొత్త పన్ను విధానంపై ప్రజల్లో గందరగోళం.. నిర్మలమ్మ ఏమన్నారంటే

Siva Kodati |  
Published : Feb 11, 2023, 04:09 PM IST
కొత్త పన్ను విధానంపై ప్రజల్లో గందరగోళం.. నిర్మలమ్మ ఏమన్నారంటే

సారాంశం

కొత్త ఆదాయపు పన్ను విధానంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. మధ్య తరగతి ప్రజలకు దీని వల్ల మేలు కలుగుతుందని ఆమె తెలిపారు. పెట్టుబడి విషయంలో వ్యక్తులకు స్వేచ్ఛ ఇస్తున్నామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 

ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌తో పాటు కొత్త ఆదాయపు పన్నువిధానంపై స్పందించారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. మధ్య తరగతి ప్రజల చేతిలో డబ్బులు మిగిలాలనే ఉద్దేశ్యంతోనే కొత్త ఆదాయపు పన్నును తీసుకొచ్చినట్లు తెలిపారు. పెట్టుబడి విషయంలో వ్యక్తులకు స్వేచ్ఛ ఇస్తున్నామని ఆర్ధిక మంత్రి తెలిపారు. ఇక అదానీ గ్రూప్ వ్యవహారంపైనా నిర్మలా సీతారామన్ స్పందించారు. భారత ప్రభుత్వ ఏజెన్సీల్లో అనుభవజ్ఞులు, నిపుణులు వున్నారని.. వాటి పని అవి చేస్తున్నాయని ఆర్ధిక మంత్రి చెప్పారు. క్రిప్టో కరెన్సీ విషయంలో కామన్ ఫ్రేమ్ వర్క్ రూపొందించేందుకు జీ 20 దేశాలతో చర్చిస్తున్నామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 

ఇదిలావుండగా.. ఇటీవల నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో మార్పులు చేశారు. దీని ప్రకారం రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్నూ వుండదని.. అలాగే రూ.7 లక్షల వరకు (రిబేట్ అనంతరం) ఎలాంటి పన్నూ వుండదని తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇక 3 నుంచి రూ.6 లక్షల ఆదాయంపై 5 శాతం.. రూ 6 నుంచి 9 లక్షల మధ్య ఆదాయం వుంటే 10 శాతం... 9 నుంచి 12 లక్షల ఆదాయంపై 15 శాతం.. 12 నుంచి 15 లక్షల ఆదాంయపై 20 శాతం... 15 లక్షలపైన ఆదాయం వుంటే 30 శాతం పన్ను విధిస్తామని తెలిపారు. 

ALso REad: Adani Controversy:అదానీ స్టాక్ క్రాష్‌పై ఆర్థిక మంత్రి.. దేశ ప్రతిష్టకు హాని కలిగించదని అంటూ..

ఇకపోతే.. అదానీ గ్రూప్ అంశం-హిండెన్‌బర్గ్ నివేదిక‌పై విచార‌ణ జ‌ర‌పాల‌న్న పిటిష‌న్ పై సుప్రీంకోర్టు శుక్ర‌వారం నాడు విచార‌ణ జ‌రిపింది. ఈ క్ర‌మంలోనే ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. పెట్టుబడిదారులను రక్షించడానికి పటిష్ఠమైన విధానాలను అమలు చేయడానికి ప్ర‌త్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. తాము ఎలాంటి రెగ్యులేటరీ ఫ్రేమ్ వ‌ర్క్స్ అనుమానాలు వ్యక్తం చేయడం లేదా విధానపరమైన విషయాల్లోకి వెళ్లడం లేదని, అయితే భారతీయ పెట్టుబడిదారులకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పర్దివాలాలతో కూడిన ధర్మాసనం పెట్టుబడిదారుల రక్షణకు పటిష్టమైన విధానాలను అమలు చేయడానికి డొమైన్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు పడిపోవడం వల్ల భారతీయ ఇన్వెస్టర్లు కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టాలను చవిచూశారని సుప్రీంకోర్టు తెలిపింది. అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని ఆరోపించడంతో అదానీ గ్రూప్ షేర్లు పతనమయ్యాయి. అదానీ గ్రూప్ ఎలాంటి తప్పు చేయలేదని, హిండెన్ బర్గ్ పై దావా వేస్తానని హెచ్చరించింది. అయిన‌ప్ప‌టికీ అదానీ గ్రూప్ షేర్ల ప‌త‌నం ఆగ‌లేదు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం