కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 4 శాతం డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం, ఖజానాపై 12 వేల కోట్లకు పైనే భారం

By Siva KodatiFirst Published Mar 24, 2023, 9:53 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం జనవరి , ఫిబ్రవరి నెలలకు సంబంధించిన డీఏ బకాయిలు సైతం ఉద్యోగులకు అందుతాయి.
 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) 4 శాతం పెరిగింది. ప్రతి నెలా జారీ అయ్యే సీపీఐ సూచీ ప్రకారం అంటే వినియోగదారుల సూచీ ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం పెరుగుతూ వస్తుంది. కేంద్ర కార్మిక శాఖ ఎప్పటికప్పుడు ఈ సూచీని విడుదల చేస్తూ వుంటుంది. గతేడాది డిసెంబర్ నెల నాటి సూచీ ప్రకారం 4.3 శాతం డీఏ లెక్క వేశారు. ఈ క్రమంలోనే కేంద్రం ఈసారి డీఏను 4 శాతం పెంచినట్లుగా తెలుస్తోంది. ఆదాయం, ఇతర రాబడులును పరిగణనలోనికి తీసుకుని డీఏ పెంపు ప్రతిపాదనను కేంద్ర ఆర్ధిక శాఖ.. కేబినెట్ అనుమతికి పంపుతుంది. 

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 38 శాతం డీఏ అందుకుంటున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో డీఏ అలవెన్స్‌ పెంపుకు ఆమోదం లభించింది. దీని ప్రకారం జనవరి , ఫిబ్రవరి నెలలకు సంబంధించిన డీఏ బకాయిలు సైతం ఉద్యోగులకు అందుతాయి. డీఏ పెంపుదల నేపథ్యంలో ఉద్యోగి ఖాతాలో పెద్ద మొత్తంలో జమ అవుతుంది. దీని వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి కలగనుంది. డీఏ పెంపు కారణంగా కేంద్ర ప్రభుత్వ ఖజానాపై రూ.12,815 కోట్ల అదనపు భారం పడనుంది. 

click me!