ఇబ్బందిపెట్టిన షుగర్: మధ్యలోనే ముగించిన నిర్మల, అయినా రికార్డు

Siva Kodati |  
Published : Feb 01, 2020, 04:41 PM ISTUpdated : Feb 01, 2020, 06:17 PM IST
ఇబ్బందిపెట్టిన షుగర్: మధ్యలోనే ముగించిన నిర్మల, అయినా రికార్డు

సారాంశం

2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. సుమారు 160 నిమిషాలకు పైగా నిర్మల సుధీర్ఘ ప్రసంగం చేశారు. ఈ క్రమంలో ఆమెకు షుగర్ లెవల్స్ తగ్గడంతో రెండు పేజీలు చదవకుండానే తన ప్రసంగాన్ని మంత్రి ముగించారు.

2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. సుమారు 160 నిమిషాలకు పైగా నిర్మల సుధీర్ఘ ప్రసంగం చేశారు.

Also Read:ఫర్నీచర్, చెప్పుల ధరలు ఆకాశంలోకి... తగ్గనున్నసెల్‌ఫోన్ ధరలు: పెరిగేవి, తగ్గేవి ఇవే

ఈ క్రమంలో ఆమెకు షుగర్ లెవల్స్ తగ్గడంతో రెండు పేజీలు చదవకుండానే తన ప్రసంగాన్ని మంత్రి ముగించారు. మధ్యలో ఆమె షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకున్నారు. నిర్మల ఇబ్బంది పడుతుండటంతో సహచర కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీతో పాటు ప్రధాని నరేంద్రమోడీ ఆమెను గమనిస్తూనే ఉన్నారు.

శనివారం చేసిన ప్రసంగం ద్వారా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా 160 నిమిషాలకు పైగా ఆమె బడ్జెట్ ప్రసంగం సాగించారు.

Also Read:కేంద్ర బడ్జెట్ 2020: రూ. 5 లక్షలలోపు వార్షికాదాయం ఉంటే నో పన్ను

నిర్మల గతంలో  2017-18లో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో 2 గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించి తాజాగా దానిని అధిగమించారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత లోక్‌సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. 
 

PREV
click me!

Recommended Stories

UPSC Interview Questions : గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగానే ఎందుకు మారతాయి..?
Best Mileage Cars : బైక్ కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే.. రూ.30 వేల శాలరీతో కూడా మెయింటేన్ చేయవచ్చు