నిర్భయ కేసు దోషుల మరో ఎత్తు: రాష్ట్రపతికి అక్షయ్ ఠాకూర్ మెర్సీ పిటిషన్

By telugu teamFirst Published Feb 1, 2020, 4:01 PM IST
Highlights

నిర్భయ కేసు దోషుల్లోని నలుగురు దోషుల్లో అక్షయ్ ఠాకూర్ శనివారం రాష్ట్రపతి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాడు. వినయ్ శర్మ మెర్సీ పిటిషన్ ను తిరస్కరించిన తర్వాత కొద్ది గంటలకే అతను ీ పిటిషన్ పెట్టుకున్నాడు.

ఢిల్లీ: నిర్భయ కేసు దోషుల్లో మరొకతను రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాడు. వినయ్ శర్మ మెర్సీ పిటిషన్ తోసిపుచ్చిన తర్వాత కొద్ది గంటల్లోనే అక్షయ్ ఠాకూర్ రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాడు. రెండు రోజుల క్రితం అక్షయ్ ఠాకూర్ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. 

మహిళలపై హింసకు సంబంధించిన కేసుల్లో ప్రజల నుంచి ఎదురయ్యే ఒత్తిడి, ప్రజాభిప్రాయాలను అనుసరించి కోర్టులు సర్వరోగ నివారణిగా దోషులకు మరణశిక్ష విధిస్తున్నాయని అనతు తన క్యూరేటివ్ పిటిషన్ లో అన్నాడు. ఈ పిటిషన్ ను ఐదుగురు సభ్యుల బెంచ్ ప్రత్యేక ఛాంబర్ లో పరిశీలించి తిరస్కరించింది. 

Also Read: నిర్భయ కేసు: వినయ్ శర్మ మెర్సీ పిటిషన్ ను తిరస్కరించిన రాష్ట్రపతి

నిర్భయ కేసుకు సంబంధించిన నలుగురు దోషుల్లో ముకేష్ కు ఇప్పటికే న్యాయపరమైన అవకాశాలు అన్నీ మూసుకుపోయాయి. అక్షయ్ కు కూడా మెర్సీ పిటిషన్ తో అన్ని న్యాయపరమైన ద్వారాలు మూసుకుపోతాయి. వినయ్ శర్మ మెర్సీ పిటిషన్ రాష్ట్రపతి ఉన్న నేపథ్యంలో ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ నిర్భయ దోషులు కోర్టుకు ఎక్కారు. దాంతో ఉరిశిక్ష అమలును కోర్టు వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఉరిశిక్షను అమలు చేయకూడదని తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. 

Also Read: నిర్భయ కేసు: రేపు దోషులకు ఉరిశిక్ష లేదు, కోర్టు స్టే

ఇక నలుగురిలో ఒక్కడే పవన్ ఇప్పటి వరకు ఏ విధమైన న్యాయపరమైన అవకాశాలను కూడా వాడుకోలేదు. క్యూరేటివ్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. అక్షయ్ ఠాకూర్ తర్వాత అతను న్యాయపరమైన అవకాశాలను వాడుకోవచ్చునని అంటున్నారు 

click me!