కేంద్ర బడ్జెట్ 2019: జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు

By narsimha lodeFirst Published Jul 5, 2019, 11:33 AM IST
Highlights

 దేశంలో రవాణా రంగానికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇచ్చింది.  జాతీయ రహదారుల గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్  ప్రకటించారు.

న్యూఢిల్లీ:  దేశంలో రవాణా రంగానికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇచ్చింది.  జాతీయ రహదారుల గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్  ప్రకటించారు.

శుక్రవారం నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  రవాణ రంగం కోసం కొత్త రూపీ కార్డును ప్రవేశపెట్టనున్నట్టుగా ఆమె చెప్పారు. సాగర మాల ద్వారా జల రవాణను మెరుగుపడే అవకాశం ఉందని మంత్రి  అభిప్రాయపడ్డారు. భారత మాల ఫేజ్-2 లో రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు  మంత్రి తెలిపారు.

భారత మాల ద్వారా దేశంలోని రోడ్డు రవాణా మార్గం మెరుగుపడే అవకాశం ఉందన్నారు. దేశంలో 657 కి.మీ మెట్రో రైలు మార్గం అందుబాటులోకి వచ్చిందని  మంత్రి చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూ. 10వేల కోట్లను కేటాయించినట్టు మంత్రి ప్రకటించారు. మరో వైపు విమాన తయారీపై కేంద్రీకరించనున్నటు చెప్పారు.
చిన్న నగరాల్లో కూడ ఎయిర్‌పోర్టుల నిర్మానానికి పెద్ద పీట వేస్తామని మంత్రి తెలిపారు. 

సంబంధిత వార్తలు

నిర్మల సీతారామన్ బడ్జెట్ 2019: పార్లమెంట్‌కు వచ్చిన తల్లిదండ్రులు
కేంద్ర బడ్జెట్ 2019: నిర్మల సీతారామన్ రికార్డు

click me!