రాజద్రోహం కేసు: ఎండిఎంకె నేత వైకోకు ఏడాది జైలు

By narsimha lodeFirst Published Jul 5, 2019, 11:07 AM IST
Highlights

ఎండిఎంకె నేత, తమిళనాడు రాజకీయాల్లో  కీలకనేత వైకోకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ చెన్నై కోర్టు శుక్రవారం నాడు తీర్పు వెల్లడించింది.

చెన్నై: ఎండిఎంకె నేత, తమిళనాడు రాజకీయాల్లో  కీలకనేత వైకోకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ చెన్నై కోర్టు శుక్రవారం నాడు తీర్పు వెల్లడించింది.

రాజద్రోహం  కేసులో వైకోకు కోర్టు ఈ మేరకు ఏడాది పాటు జైలు శిక్షను విధించింది. 2009లో ప్రభుత్వంపై వైకో తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ విమర్శలపై నమోదైన కేసులపై చెన్నై కోర్టు శుక్రవారం నాడు ఈ తీర్పును ఇచ్చింది. ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానాను విధించింది.

ఐయామ్ అక్యూసింగ్ పేరుతో వైకో రాసిన పుస్తకావిష్కరణ సమయంలో ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేలా వైకో విమర్శలు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది.

 

click me!