నిర్మల సీతారామన్ బడ్జెట్ 2019: పార్లమెంట్‌కు వచ్చిన తల్లిదండ్రులు

By narsimha lodeFirst Published Jul 5, 2019, 10:55 AM IST
Highlights

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మల సీతారామన్ తొలిసారిగా శుక్రవారం నాడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తమ కూతురు ప్రవేశపెట్టే బడ్జెట్‌ ప్రసంగాన్ని చూసేందుకు ఆమె తల్లిదండ్రులు శుక్రవారం నాడు పార్లమెంట్‌కు వచ్చారు.
 

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మల సీతారామన్ తొలిసారిగా శుక్రవారం నాడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తమ కూతురు ప్రవేశపెట్టే బడ్జెట్‌ ప్రసంగాన్ని చూసేందుకు ఆమె తల్లిదండ్రులు శుక్రవారం నాడు పార్లమెంట్‌కు వచ్చారు.

 

Delhi: Parents of Finance Minister Nirmala Sitharaman - Savitri and Narayanan Sitharaman - arrive at the Parliament. She will present her maiden Budget at 11 AM in Lok Sabha. pic.twitter.com/Wp3INz7ifN

— ANI (@ANI)

 

గతంలో  ఇందిరాగాంధీ తాత్కాలికంగా ఆర్థిక శాఖ బాద్యతలను కూడ నిర్వహించారు. ప్రధానమంత్రిగా ఉంటూనే ఇందిరా గాంధీ ఆర్థిక శాఖను కూడ నిర్వహించారు. ఈ సమయంలోనే  1970-71 లో ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

పూర్తికాలం ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నిర్మల సీతారామన్  శుక్రవారంనాడు బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనున్నారు. నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని వినేందుకు తల్లిదండ్రులు పార్లమెంట్‌కు వచ్చారు. పార్లమెంట్ సిబ్బంది, ఆర్థిక శాఖాధికారులు నిర్మల సీతారామన్ తల్తిదండ్రులను పార్లమెంట్‌లోకి తీసుకెళ్లారు.

నిర్మల సీతారామన్  తండ్రి రైల్వేలో ఉద్యోగిగా పనిచేసి రిటైరయ్యారు.నిర్మల సీతారామన్ కుటుంబం తమిళనాడు నుండి వచ్చింది.నిర్మల సీతారామన్ తండ్రి నారాయణ , తల్లి సావిత్రి లు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొద్ది నిమిషాల ముందు పార్లమెంట్‌కు చేరుకొన్నారు.

సంబంధిత వార్తలు

కేంద్ర బడ్జెట్ 2019: నిర్మల సీతారామన్ రికార్డు

click me!