Ukraine Russia Crisis రష్యా దాడులతో భారీగా ప్రాణ నష్టం: ఉక్రెయిన్ రాయబారి ఫాలిఖా

Published : Feb 24, 2022, 02:52 PM ISTUpdated : Feb 24, 2022, 02:56 PM IST
Ukraine Russia Crisis రష్యా దాడులతో భారీగా ప్రాణ నష్టం: ఉక్రెయిన్ రాయబారి ఫాలిఖా

సారాంశం

రష్యా దాడితో తమ ప్రజలు భారీగా మరణించారని భారత్ లోని ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ ఫాలిఖా చెప్పారు. సామాన్యులను కూడా రష్యా లక్ష్యంగా దాడులు చేసిందని ఆయన చెప్పారు.

న్యూఢిల్లీ:రష్యాది సైనిక చర్య కాదు యుద్దమే అని ఇండియాలోని Ukraine రాయబారి ఇగోర్ ఫాలిఖా చెప్పారు.గురువారం నాడు New Delhi లోని ఉక్రెయిన్ రాయబారి Igor Polikha  మీడియాతో మాట్లాడారు. తమకు మద్దతివ్వాలని ఉక్రెయిన్ రాయబారి కోరారు.  ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన, గౌరవం పొందే నాయకుల్లో Narendra Modi కూడా ఒకరని ఆయన గుర్తు చేశారు.

తమ దేశ రాజధానిపై వైమానిక దాడులు జరిగాయని ఆయన వివరించారు.  జనావాసాలపై కూడా దాడులు చోటు చేసుకొన్నాయని ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ ఫాలిఖా తెలిపారు. తమ దేశ పౌరులను రష్యా టార్గెట్ చేసిందని ఇగోర్ ఫాలిఖా ఆరోపించారు.  ఈ యుద్ధాన్ని నివారించేందుకు ఇండియా గట్టిగా ప్రయత్నించాలని ఆయన కోరారు.  రష్యా దాడుల్లో భారీగా ఉక్రెయిన్ ప్రజలు మరణించారని ఆయన చెప్పారు. సంక్షోభ సమయంలో ఇండియా తమకు అండగా నిలుస్తోందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

Russia తో India కు ఉన్న ప్రత్యేక సంబంధాలున్నాయనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీంతో యుద్దం ఆపేందుకు  న్యూఢిల్లీ మరింత చురుకైన పాత్ర పోషించాలని ఆయన కోరారు. సైనిక కేంద్రాలతో పాటు సామాన్యులపై కూడా రష్యా దాడులు చేస్తోందని ఆయన చెప్పారు. ఉక్రెయిన్ దళాలు ఐదు రష్యన్ విమానాలు రెండు హెలికాప్టర్ు,  ట్యాంకులు, ట్రక్కులను కాల్చివేశాయి., రష్యా దళాలు సరిహద్దును దాటుతున్నట్టుగా తమకు సమాచారం అందిందని భారత్ లోని ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పాలిఖా చెప్పారు.

 ఉక్రెయిన్ ప్రభుత్వం తమ దేశంలోని తూర్పు ప్రాంతంలోని మిమానాశ్రయాలను అర్ధరాత్రి 7 గంటల నుండి మూసివేసింది. ఉక్రెయిన్ అభ్యర్ధన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తోంది. 

ఉక్రెయిన్ పై రష్యా దాడిని అన్యాయమైన దాడిగా అమెరికా అధ్యక్షుడు Joe Biden  అభిప్రాయపడ్డారుఉక్రెయిన్ మిలటరీ ఆపరేషన్ కు రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా తేల్చి చెప్పింది.  రష్యా దాడికి ప్రతి చర్య తప్పదని జో బైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ కు నాటో దళాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి.  

ఉక్రెయిన్ పై తమ మిలటరీ చర్య విషయంలో ఇతరుల జోక్యాన్ని తాము సహించబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు.   జోక్యం చేసుకొన్న దేశాలు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని పుతిన్ హెచ్చరించారు.

దీంతో ఉక్రయిన్ లో అత్యవసర పరిస్థతిని విధించారు. తమ ఎయిర్ స్పేస్ ను ఉక్రెయిన్ మూసివేసింది.   ఉక్రెయిన్ లో ఖార్కిస్, ఒడెస్సా, పోల్ లో మిస్సైల్స్ తో దాడులు చోటు చేసుకొన్నాయి. డోస్‌బాస్ లో ఉక్రెయిన్ బలగాలను వెనక్కి వెళ్లిపోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. 

ఇదిలా ఉంటే ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని చైనా ప్రకటించింది. ఇరు వర్గాలు సంయమనం పాటించాలని చైనా కోరింది.ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో గురువారం నాడు దేశ ప్రజలనుద్దేశించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగించనున్నారు. ఈ దాడితో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని అమెరికా అభిప్రాయపడింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?